Salaar OTT: సలార్ ఓటీటీ వివరాలు లీక్.. అందులోనే వస్తుంది.. కానీ ఓ బ్యాడ్ న్యూస్

తెలుగు చిత్ర పరిశ్రమలోకి బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా.. తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, స్టైలిష్ లుక్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేసి స్టార్‌గా ఎదిగిపోయాడు ప్రభాస్. అలా చాలా కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించి.. ఇప్పుడు పాన్ ఇండియాపై దండయాత్ర చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ 'సలార్' అనే సినిమాతో వచ్చేశాడు.

కేజీఎఫ్‌ సిరీస్‌తో ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌ రూపకల్పనలో ప్రభాస్ నటించిన సినిమానే 'సలార్'. దీన్ని రెండు భాగాలుగా రూపొందించారు. అందులో మొదటి పార్టును 'సలార్: సీజ్‌ఫైర్' పేరిట నేడే (డిసెంబర్ 22న) విడుదల చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ యాక్షన్ మూవీ సందడే కనిపిస్తోంది.

Prabhas Starrer Salaar Movie OTT Partner and Streaming Date Details

ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే కనిపిస్తోంది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా లభిస్తోంది. అన్ని చోట్లా ఈ సినిమా షోలకు బుకింగ్స్ పెరుగుతున్నాయి. దీంతో దీనికి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చే చాన్స్ ఉంది.

'సలార్: సీజ్‌ఫైర్' సినిమా సందడి థియేటర్లలో మొదలు అవుతుండగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు కూడా న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Prabhas Starrer Salaar Movie OTT Partner and Streaming Date Details

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' సినిమాను థియేటర్లలో విడుదలైన 45 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని కూడా ఓ న్యూస్ తాజాగా లీక్ అయింది. అంటే డిసెంబర్ 22వ తేదీన విడుదలైన 'సలార్' చిత్రం ఫిబ్రవరి రెండో వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. 'సలార్: సీజ్‌ఫైర్' మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు సహా ఎంతో మంది నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X