Salaar OTT: సలార్ ఓటీటీ డేట్‌పై షాకింగ్ న్యూస్.. అందులో 20 రోజులకే స్ట్రీమింగా!
సలార్.. సలార్.. సలార్.. ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న పేర్లలో ఇది ఒకటి. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన ఈ చిత్రం చాలా కాలంగా సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ సెన్సేషన్ అవుతోంది. ఫలితంగా ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని ఇటీవలే ఈ చిత్రంలోని మొదటి భాగం 'సలార్: సీజ్‌ఫైర్' పేరిట ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
భారీ హైప్‌తో విడుదలైన 'సలార్: సీజ్‌ఫైర్' సినిమాకు ఓవర్సీస్‌లో వేసిన ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే కనిపించింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా లభించి రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత కూడా ఈ సినిమా భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటూ అదిరే వసూళ్లతో సత్తా చాటుతోంది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి అన్ని ఏరియాల్లోనూ భారీ స్పందన వస్తుండడంతో అప్పుడే రూ. 500 కోట్లు గ్రాస్ మార్క్‌ను కూడా దాటేసింది. ఇదే ఊపులో ఇంకాస్త ఎక్కువ వసూళ్లను కూడా రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ఓటీటీ డేట్‌పై షాకింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.
'సలార్: సీజ్‌ఫైర్' సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. ఈ చిత్రాన్ని తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో చూపించారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' సినిమాను థియేటర్లలోకి వచ్చిన 45 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని టాక్ వినిపించింది. అయితే, ఇప్పుడేమో ఈ సినిమాను జనవరి 12 నుంచే స్ట్రీమింగ్ చేయబోతున్నారని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ఇది కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా.. 'సలార్: సీజ్‌ఫైర్' మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు సహా ఎంతో మంది నటించారు. రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











