Salaar OTT: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి వార్త.. ఫిక్సైన సలార్ ఓటీటీ డేట్
ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతోన్న హీరోలు టాలీవుడ్‌లోనే ఎక్కువ మంది ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రెబెల్ స్టార్ ప్రభాస్‌దే. అంతలా అతడు చాలా ఏళ్లుగా భారీ చిత్రాల్లో నటిస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమానే 'సలార్: సీజ్‌ఫైర్'. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమాకు ఓవర్సీస్‌లో వేసిన ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే కనిపించింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా లభించి రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి.

ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి అన్ని ఏరియాల్లోనూ భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రం మూడు వారాల్లోనే రూ. 600 కోట్లు గ్రాస్ మార్క్‌ను కూడా దాటేసింది. సంక్రాంతి సినిమాల వల్ల దీని రన్‌కు గ్యాప్ వచ్చినా.. తర్వాత కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ఓటీటీ డేట్‌పై న్యూస్ లీకైంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' సినిమాను తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో చూపించారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుందని నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది.

'సలార్: సీజ్‌ఫైర్' సినిమాను థియేటర్లలోకి వచ్చిన 45 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని టాక్ వినిపించింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. 'సలార్: సీజ్‌ఫైర్' మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు సహా ఎంతో మంది నటించారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











