బిగ్ సర్‌ప్రైజ్: సలార్ ఓటీటీ డేట్ వచ్చేసింది.. 600 కోట్ల సినిమా ఇంత త్వరగానా!
రెబెల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోన్న పేర్లలో ఇది ఒకటి. అంతలా ఇతగాడు సుదీర్ఘ కాలంగా భారతీయ బాక్సాఫీస్‌పై ప్రభావాన్ని చూపిస్తూ దూసుకెళ్తోన్నాడు. అదే సమయంలో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇలా ఇటీవలే ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' అనే యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీనే 'సలార్: సీజ్‌ఫైర్'. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు తగ్గట్లుగానే గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఇక, దీనికి మొదట్లోనే మంచి టాక్ వచ్చింది. ఫలితంగా ఆడియెన్స్ రెస్పాన్స్ కూడా అదే రేంజ్‌లో దక్కింది. దీంతో ఈ మూవీకి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సొంతం అయ్యాయి.

హై ఓల్టేజ్ యాక్షన్‌తో తెరకెక్కిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీకి అన్ని ఏరియాల్లోనూ భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ చిత్రం మూడు వారాల్లోనే రూ. 600 కోట్లు గ్రాస్ మార్క్‌ను కూడా దాటేసింది. సంక్రాంతి సినిమాల కారణంగా 'సలార్' రన్ ముందుకు సాగలేదు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్: సీజ్‌ఫైర్' సినిమాను తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక, ఈ సినిమా స్ట్రీమింగ్ థియేటర్లలో విడుదలైన 45 రోజుల తర్వాత అని టాక్ వచ్చింది. ఆ తర్వాత 30 రోజులకే వస్తుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

'సలార్: సీజ్‌ఫైర్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌పై తాజాగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రకటన చేసింది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాను జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారని తాజాగా నెట్‌ఫిక్స్ అనౌన్స్ చేసింది. అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచే ఈ సినిమా అందుబాటులోకి రాబోతుందన్న మాట. ఇది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ అని చెప్పుకోవాలి.
ఇదిలా ఉండగా.. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన 'సలార్: సీజ్‌ఫైర్' మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు. రవి బస్రూర్ సంగీతాన్ని ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











