The Rajasaab: ఓటీటీలో ది రాజాసాబ్ ఊపు... డిజాస్టర్ మూవీతో ప్రభాస్ మరో ఘనత!

మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ది రాజాసాబ్ మూవీ డార్లింగ్ అభిమానులకు పీడకలగా మారిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీతో వింటేజ్ ప్రభాస్‌ను చూద్దామని అనుకున్న ఆశలు గల్లంతు కావడంతో పాటు నిర్మాతలకు భారీ నష్టాల్ని మిగిల్చింది. దీనికి తోడు సినిమా మేకింగ్‌పై, దర్శకుడు మారుతి పైనా భారీగా ట్రోలింగ్‌తో విరుచుకుపడ్డారు అభిమానులు. ఇలాంటి పరిస్ధితుల్లో ది రాజాసాబ్‌కు సంబంధించి ఓ పాజిటివ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
Samantha: బెడ్‌రూంలో నా భర్త నిర్వాకం ఇలా... రాజ్ నిడిమోరుపై సమంత పోస్ట్ వైరల్
Samantha: బెడ్‌రూంలో నా భర్త నిర్వాకం ఇలా... రాజ్ నిడిమోరుపై సమంత పోస్ట్ వైరల్

ది రాజాసాబ్ తారాగణం
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌‌లు ప్రభాస్ సరసన హీరోయిన్‌లుగా నటించారు. సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగి బాబు, సప్తగిరి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ది రాజాసాబ్‌కు కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌గా .. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌‌గా పనిచేశారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ది రాజాసాబ్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Prabhas s The Rajasaab Secures Strong OTT Views Despite Box Office Failure says Ormax Media Report

ది రాజాసాబ్ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ది రాజాసాబ్‌కు 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. భారీ అంచనాల నేపథ్యంలో ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 207 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. దాంతో ది రాజాసాబ్ బ్రేక్ఈవెన్ కావాలంటే 210 కోట్ల రూపాయల షేర్.. 420 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

Recommended For You
త్రిషతో విజయ్ రిలేషన్‌పై రూమర్స్... దళపతిపై తమన్నా అలాంటి వ్యాఖ్యలు
త్రిషతో విజయ్ రిలేషన్‌పై రూమర్స్... దళపతిపై తమన్నా అలాంటి వ్యాఖ్యలు

ది రాజాసాబ్ కలెక్షన్స్
ప్రభాస్ మూవీ థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇండియాలో 146.4 కోట్ల రూపాయల నెట్.. 174.14 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్, ఓవర్సీస్‌లో 34.25 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 208.39 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ పేర్కొంది. తమిళనాడులో 15 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 123 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 2.96 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.10 కోట్ల రూపాయలు, కేరళలో 40 లక్షల రూపాయలు, హిందీలో 29.88 కోట్ల రూపాయలు వసూలైనట్లు సాక్‌నిక్ వెల్లడించింది.

ది రాజాసాబ్‌కు భారీ నష్టాలు
థియేట్రికల్ రన్ ముగిసేసరికి తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల రూపాయల నెట్.. 123 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాడు ప్రభాస్. కనీసం ఒక్క ఏరియాలోనూ బ్రేక్ఈవెన్ కాకపోగా.. ది రాజాసాబ్ కారణంగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ప్రభాస్ తన ఛరిష్మాతో ఈ సినిమా కలెక్షన్స్‌ను 200 కోట్ల మార్క్ దాటించగలిగాడు. కానీ నష్టాలను మాత్రం తప్పించలేకపోయాడు. అయితే డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో హక్కుల ద్వారా నిర్మాత కొంతమేర ఒడ్డునపడినట్లుగా ఫిలింనగర్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

You May Also Like
'సుఖం కోసం హీరోయిన్లకు అలాంటి చాక్లెట్లు... కాంప్రమైజ్ అడిగితే కట్ చేయడమే’
'సుఖం కోసం హీరోయిన్లకు అలాంటి చాక్లెట్లు... కాంప్రమైజ్ అడిగితే కట్ చేయడమే’

ది రాజాసాబ్ ఓటీటీ
థియేటర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన ది రాజాసాబ్ మూవీ ఫిబ్రవరి 6వ తేదీ నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మార్చి 6వ తేదీ నుంచి హిందీలో ది రాజాసాబ్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయితే ఓటీటీలో రిలీజైన తర్వాత ఈ సినిమాలోని సీజీ వర్క్, స్క్రీన్ ప్లే, బాడీ డబుల్, గ్రాఫిక్స్‌లపై నెటిజన్లు మీమ్స్‌తో విరుచుకుపడ్డారు. దర్శకుడు మారుతిని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేయడంతో పాటు ఆయన ఇంటి అడ్రస్‌కు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్‌తో ఇబ్బందిపెట్టారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఓటీటీ పరంగా ది రాజాసాబ్ ఓ ఘనత సాధించింది.

'అటాంటి వాళ్లే ఇండస్ట్రీలో టార్గెట్.. ఆ కేసులో నన్ను అలా ఇరికించి’
'అటాంటి వాళ్లే ఇండస్ట్రీలో టార్గెట్.. ఆ కేసులో నన్ను అలా ఇరికించి’

ది రాజాసాబ్‌కు రికార్డ్ వ్యూస్
మార్చి 9 నుంచి మార్చి 15 వరకు వివిధ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలలో టాప్ ట్రెండింగ్‌లో ఉన్న వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఇతర ఈవెంట్స్‌కు సంబంధించిన డేటాను ప్రముఖ మీడియా అండ్ టీవీ వాచ్ ఏజెన్సీ ఆర్మాక్స్ మీడియా వెల్లడించింది. దీని ప్రకారం ది రాజాసాబ్ మూవీ 2.9 మిలియన్ల వ్యూస్‌తో ఈ లిస్ట్‌లో 9వ స్థానంలో నిలిచింది. డిజాస్టర్ టాక్‌కి తోడు, భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న ఈ సినిమా ఓటీటీలో మాత్రం ఈ స్థాయిలో సత్తా చాటడం సినీవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అయితే హిందీలో ఇటీవల విడుదల కావడం వల్లే రాజాసాబ్ ఈ ఫీట్ అందుకున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.

60 ఏళ్ల బిజినెస్‌మెన్‌తో అఫైర్.. కస్తూరి జీవితంలో వాస్తవం ఏమిటి?
60 ఏళ్ల బిజినెస్‌మెన్‌తో అఫైర్.. కస్తూరి జీవితంలో వాస్తవం ఏమిటి?

టీ20 వరల్డ్ కప్‌కు ప్రేక్షకులు జై
ఇకపోతే.. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ 2026 ఈ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 21.6 మిలియన్ల మంది టీ20 వరల్డ్ కప్‌ను వీక్షించారు. ఆ తర్వాత ది 50 (జియో హాట్‌స్టార్- 7.2 మిలియన్లు), నాగిన్ సీజన్ 7 (జియో హాట్‌స్టార్- 4.2 మిలియన్లు), తారక్ మెహతా కా (సోనీ లివ్- 3.8 మిలియన్లు), సుబేదార్ (అమెజాన్ ప్రైమ్ వీడియ్- 3.6 మిలియన్లు), అనుపమ (జియో హాట్‌స్టార్ - 3.3 మిలియన్లు), లాఫ్టర్ చెఫ్స్ సీజన్ 3 (జియో హాట్‌స్టార్- 3.2 మిలియన్లు), సంకల్ప్ (అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ - 3 మిలియన్లు)తో ది రాజా సాబ్ కంటే ముందున్నాయి. స్ప్లిట్స్ విల్లా ఎక్స్ 6 (జియో హాట్‌స్టార్ - 2.8 మిలియన్ల వ్యూస్)తో చివరి స్థానంలో నిలిచాయి.

More from Filmibeat

Read more about: prabhas the rajasaab ormax media
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X