OTTలోకి మరో హార్రర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. వెన్నులో వణుకుపుట్టించే దీన్ని ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో అనేక అద్భుతమైన హార్రర్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రాలు ఓటీటీ వేదికగా వస్తూ సందడి చేస్తున్నాయి. ఎక్కువ మంది జనాలు ఇలాంటి తరహా చిత్రాలే ఇష్టపడుతుండడంతో అలాంటివే తీసుకు వస్తున్నారు. సినీ ప్రియులు కూడా తమకు నచ్చిన సినిమాలు వస్తుండగా.. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో వాటినే చూస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ వారమే అనేక థ్రిల్లర్ చిత్రాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం కాగా మరో సరికొత్త హార్రర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఆ సినిమా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మనోజ్ బాజ్ పేయీ, ప్రాచీ దేశాయ్ ప్రధాన పాత్రలో వచ్చిన సరికొత్త క్రైమ్ డ్రామా థ్రిల్లర్ డ్రామానే సైలెన్స్ 2: ది నౌట్ ఓల్ బార్ షూట్ఔట్. సైలెన్స్ 2: ది నైట్ ఔల్ బార్ షూటౌట్ సినిమాకు అబాన్ భారుచా డియోహాన్స్ దర్శకత్వం వహించారు. ఇందులో మనోజ్ బాజ్‌పేయి, ప్రాచీ దేశాయ్ లు ప్రధాన పాత్రలో కనిపించగా... పరుల్ గులాటీ, సాహిల్ వైద్, వక్వార్ షేక్, అంకిత్ భరద్వాజ్, సుజాత మొగల్, శృతి బాప్నాలు కీలక పాత్రల్లో నటించారు.

జీ స్టూడియోస్ ప్రొడక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు పూజా గుప్త నినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అలాగే సందీప్ కుమార్, శెట్టి ఎడిటింగ్ బాధ్యతలు చూసుకోగా.. గౌరవ్ గోద్ కింది మ్యూజిక్ అందించారు. అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను నేరుగా ఓటీటోలో విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5 వేదికగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు.

అద్భుతమైన హార్రర్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు చాలా మంది. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూడాలా అని కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం ఏప్రిల్ 16వ తేదీన అంటే ఈ మంగళవారం విడుదల కాబోతున్న ఈ సినిమాను కచ్చితంగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి చూసేయండి.


Click it and Unblock the Notifications











