Dragon OTT Release :డ్రాగన్ ఓటీటీ రిలీజ్.. ప్రదీప్ రంగనాథన్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
లవ్ టుడే లాంటి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్. ప్రేమకథలు, నేటి తరానికి నచ్చే వినూత్న కథలతో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్. రీసెంట్‌గా ఆయన నటించిన చిత్రం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మేకర్స్.
తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థగా ఉన్న ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాతలు కళాపతి ఎస్ అఘోరం, కళాపతి ఎస్ గణేష్, కళాపతి ఎస్ సురేష్‌లు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ సరసన అనుపమ పరమేశ్వరన్, కాయడు లోహర్‌లు నటించారు. ప్రత్యేక పాత్రలో ఇవానా మెరిశారు.

అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లు అయిన కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్‌తోపాటు సీనియర్ హీరోయిన్ స్నేహ అతిథి పాత్రలో కనిపించారు. జార్జ్ మార్యన్, ఇందుమతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నిమాటోగ్రఫి నికేత్ బొమ్మిరెడ్డి, ఎడిటింగ్ ప్రదీప్ ఈ రాఘవ్, మ్యూజిక్ లియోన్ జేమ్స్ అందించారు. నటీనటులు , సాంకేతిక నిపుణుల పారితోషికాలతో కలిపి ఈ చిత్రానికి రూ.. 40 కోట్ల బడ్జెట్‌గా అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.
ప్రదీప్ గతంలో నటించిన లవ్ టుడే భారీ సక్సెస్ అందుకోవడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి అనుగుణంగానే ఈ సినిమాను ఇండియాలో 1000 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తమిళంలో ఏజీఎస్ సంస్థ సొంతంగా రిలీజ్ చేసుకోగా.. తెలుగులో ఏషియన్ సురేష్ డిస్టిబ్యూటర్స్ విడుదల చేసింది. ఈ క్రేజ్‌కు తగినట్లుగానే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 6 కోట్లకు ఓపెనింగ్స్ రాబట్టి దుమ్మురేపింది.
మరోవైపు.. ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు ఈ సెక్షన్ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ .. డ్రాగన్ డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకున్నట్లుగా కోలీవుడ్ వర్గాల టాక్. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది . అయితే నిబంధనల ప్రకారం.. థియేటర్‌లో రిలీజైన 5 వారాల తర్వాత ఏ సినిమా అయినా ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది.
దీనిని బట్టి చూస్తే మార్చి చివరి వారంలో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్ సర్కిల్స్‌లో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ అన్నది ముందే జరగొచ్చు లేదంటే మరింత ఆలస్యం కావొచ్చు. ఏది ఏమైనప్పటికీ త్వరలోనే ప్రదీప్ రంగనాథన్ సినిమా ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ రానుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?


Click it and Unblock the Notifications











