OTTలోకి సంచలన రాజకీయ చిత్రం.. ఊహించని ఓటీటీలో ఎప్పుడంటే?
సినిమా.. సినిమా.. సినిమా.. సినీ ప్రియులు పరితపించే పేరు. ఎలాంటి జోనర్ అయినా కొత్తదనం ఉంటే చాలు కచ్చితంగా ఆదరిస్తారు. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయినా, మాస్ మసాలా ఉన్న అడల్ట్ చిత్రమైనా, అదిరిపోయే ఫైట్, చేజింగ్ సీక్వెన్సులు ఉన్న యాక్షన్ మూవీ అయినా.. అడ్వెంచర్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్, మైథలాజికల్, బయోగ్రఫీ, పొలిటికల్ డ్రామా ఏదైతే ఏంటీ.. విభిన్నంగా ఉంటే చూసేందుకు ఎగబడతారు. అలా డిఫరెంట్ జోనర్లలో డిఫరెంట్ గా సినిమాలు అందిస్తుంటుంది మలయాళ చిత్ర పరిశ్రమ. అలాంటి మాలీవుడ్ నుంచి సంచలం క్రియేట్ చేసిన పొలిటికల్ డ్రామాను తెలుగులో విడుదల చేయనున్నారు.
సినీ ఇండస్ట్రీలో మలయాళ చిత్ర పరిశ్రమకు మంచి క్రేజ్ ఉంది. ఏ భాష వారైన సరే మాలీవుడ్ సినిమాలను ఆదరిస్తుంటారు. ఎందుకంటే కథ ఎలా ఉన్నా తెరకెక్కించే విధానం ఆకట్టుకునేలా ఉంటుంది. ఎలాంటి జోనర్ అయినా విభిన్నంగా ప్రజంట్ చేస్తుంటారు. ఇటీవల 2018 (2018 Movie) సినిమాతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెయ్‌మార్ (Neymar Movie) అనే సినిమా కూడా మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఇప్పుడు మరో మలయాళ సినిమా తెలుగులో రిలీజుకు సిద్ధంగా ఉంది.

విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నారు ప్రకాష్ రాజ్ (Prakash Raj). రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన ఆయన నటించిన పొలిటికల్ డ్రామా చిత్రం 'వరల్' (Varaal Movie). కన్నన్ తామరైకులం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనూప్ మేనన్, సన్నీవేన్, సురేష్ కృష్ణ, శంకర్ రామకృష్ణన్, రెంజీపానికర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. టైమ్ యాడ్స్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై పీఏ సెబాస్టియన్ నిర్మించారు.
గతేడాది అక్టోబర్ 14న విడుదలైన వరాల్ సినిమా భారీ విజయం సాధించింది. సమకాలిన రాజకీయ అంశాలను టచ్ చేస్తూ హృద్యంగా తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో 'పార్థుడు' (Parthudu Movie 2023) అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. దీనికి 'పొలిటికల్ గేమ్స్' అని క్యాప్షన్ ఇచ్చారు. పార్థుడు సినిమాను (Parthudu Movie OTT) ఓటీటీ అయినా ఈటీవీ విన్ (ETV Win)లో ఆగస్ట్ 25 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా వేదిగా ఈటీవీ విన్ ప్రకటించింది. ఎప్పుడో ప్రారంభమైన ఈ ఓటీటీ ఇటీవల మంచి సినిమాలతో ఎంటర్టైన్ చేస్తుంది. ఈటీవీ విన్ లో ఇలాంటి పొలిటికల్ డ్రామా మూవీ వస్తుందని ఎవరూ ఊహించకపోవచ్చు.


Click it and Unblock the Notifications











