twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మూవీ ఇండస్ట్రీలో అలాంటి మాఫియా.. ఆ గ్యాంగ్‌‌కు కాలం చెల్లింది.. ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

    |

    విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం తెలిసిందే. ప్రభుత్వ తీరును జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నిస్తూనే ఉంటాడు. అయితే తాను నటించిన ముక్బీర్ అనే చిత్ర ప్రమోషన్‌లో ప్రకాశ్ మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

    వెలుగులోకి రాని దేశభక్తుల గురించి

    వెలుగులోకి రాని దేశభక్తుల గురించి

    జీ5 ఓటీటీలో రిలీజ్ కానున్న ముక్బీర్ థ్రిల్లర్‌లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్నాను. నేను ఇంకా పుట్టని సమయంలో అంటే.. 1960 నుంచి 2022 వరకు జరిగిన కొన్ని మరుగున పడిన సంఘటనలను తెరపైన ఆవిష్కరించనున్నాను. ఈ రోజు నేను స్వేచ్ఛగా బతుకుతున్నానంటే.. అందుకు కారణం దేశం కోసం ప్రాణాలిచ్చిన త్యాగధనులే. అలాంటి త్యాగధనుల్లో కొందరు మనకు తెలియదు. అలాంటి వారి గురించి ఈ చిత్రంలో చెబుతున్నాం అని ప్రకాశ్ అన్నారు.

    ఏదో ఒక రూపంలో స్పూర్తి..

    ఏదో ఒక రూపంలో స్పూర్తి..

    దేశాన్ని ఎన్నో సంఘటనలు, విషయాలు ముందుకు నడిపిస్తుంటాయి. ఒకరి ఐడియాలజీ, ఓ పార్టీ, ఓ నేత దేశానికి స్పూర్తినిస్తారు. ఈ దేశంలో బతికే ప్రతీ వ్యక్తి దేశభక్తుడే. వారు తమ దేశానికి ఎన్నో సేవలు ఏదో రూపంలో అందిస్తారు. వారి గురించి మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

    రాజీ మూవీని పోల్చి చూడకండి...

    రాజీ మూవీని పోల్చి చూడకండి...

    ముక్బీర్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఆలియాభట్ నటించిన రాజీ సినిమా మాదిరిగా ఉందని అందరూ అంటున్నారు. అయితే ఈ రెండు చిత్రాలు కూడా పాకిస్థాన్‌లో జరిగిన గూఢచారి నేపథ్యంగా సాగే చిత్రాలే. కానీ కథలు వేరు. ముక్బీర్ పాక్, ఇండియా గురించి కాదు. కేవలం బ్యాక్ డ్రాప్ మాత్రమే. ఓ గూఢచారి అస్థిత్వాన్ని ప్రశ్నించే నేపథ్యంగా కథ సాగుతుంది అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.

    మూవీ ఇండస్ట్రీలో మాఫియా గురించి

    మూవీ ఇండస్ట్రీలో మాఫియా గురించి


    సినిమా రంగంలో మాఫియా అనే పదం క్రేజీగా వినిపిస్తుంది. అప్పడప్పుడు మాఫియా ఆధారంగా సినిమాలు వస్తుంటాయి. సినిమా అనేది మాధ్యమం. అది ఒక నదీ ప్రవాహంలా సాగుతుంది. ఆ ప్రవాహంతో ప్రేక్షకులు సాగిపోవాల్సిందే. అయితే రెండు గంటలపైగా నడిచే సినిమాపై అనేక ఆంక్షలు ఉండేవి. ముందుగా టీవీలో రిలీజ్ ఎలా చేస్తారని అడ్డుకొనే వారు. కరోనా పాండమిక్ కారణంగా అలాంటి మాఫియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు ఓటీటీ రూపంలో ప్రేక్షకులు తమకు నచ్చిన కంటెంట్‌ను చూస్తున్నారు.

    ముక్బీర్ రిలీజ్ ఎప్పడంటే?

    ముక్బీర్ రిలీజ్ ఎప్పడంటే?

    ముక్బీర్ సినిమా విషయానికి వస్తే.. జీ5లో నవంబర్ 11వ తేదీన రిలీజ్ అవుతన్నది. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్‌తోపాటు జైన్ ఖాన్ దురానీ, ఆదిల్ హుస్సేన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు శివమ్ నాయర్, జయప్రద్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రకాశ్ రాజ్ కెరీర్ విషయానికి వస్తే.. వారిసు, కబ్జా, శాకుంతలం తదితర సినిమాల్లో నటిస్తున్నారు.

    English summary
    Actor Prakash Raj is coming with Mukbir Web series. This Web Series is releasing on ZEE5 on November 11th. Here is the Prakash Raj's comments on the Sensational mafia in Film Industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X