OTTలోకి మమితా బైజు రీసెంట్ రొమాంటిక్ మూవీ.. ఈ క్రేజీ చిత్రాన్ని ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలోల అనేక అదిరిపోయే చిత్రాలు ఓటీటీ వేదికగా వస్తూ తెగ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా అంతా హార్రర్, క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ చిత్రాలను అంతా తెగ ఇష్టపడుతున్నారు. ఈ విషయం అర్థం చేసుకున్న దర్శక, నిర్మాతలు కూడా అలాంటి చిత్రాలనే తీసుకు వస్తుండగా.. అంతా వాటినే చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేమలు మూవీ బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా చేసిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.
ప్రేమలు సినిమా వచ్చిన తర్వాత నుంచి అంతా మమితా బైజు చిత్రాలను చూసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో ఆమె ఎలాంటి చిత్రాలు చేసింది అని తెలుసుకుని మరీ ఆ సినిమాలను చూస్తున్నారు. అయితే తాజాగా ఆమె హీరోయిన్ గా చేసిన ఈ రీసెంట్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఆ సినిమా పేరే ప్రణయ విలాసం. నిఖిల్ మురళి దర్శకత్వం వహించిన ఈ సినిమాను గ్రీన్ రూమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సిబి చవర, రెంజిత్ నాయర్ నిర్మించారు. ఇందులో అర్జున్ అశోకన్, అనశ్వర రాజన్, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించారు.

అలాగే అనస్వర రాజన్, శ్రీధన్య, హకీం షా, మనోజ్ కేయూ, మియా జార్జ్, శరత్ సభ, హకీం షాజహాన్, ఉన్నిమయ నాల్పడంలు కూడా కీలక పాత్రల్లో నటించారు. షాన్ రెహ్మాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించగా.. షినోజ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. గతేడాది ఫిబ్రవరి 24వ తేదీన విడుదల అయిన ఈ సినిమా థియేటర్ల వద్ద పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది. అయితే సూపర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతుంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం అయిన ఈటీవీ విన్ వేదికగా ఈ ప్రణయ విలాసం సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. మే 2వ తేదీ నుంచి ఈ చిత్రం అందుబాటులోకి రాబోతున్నట్లు ఈటీవీ విన్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. దీంతో అంతా తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. కచ్చితంగా మమితా బైజు రొమాంటిక్ కామెడీ మూవీని చూడాలని అనుకుంటున్నారు. ఫుల్ గా ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మరి మీరు కూడా ఈ క్యూట్ మూవీని ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











