HanuMan OTT: హనుమాన్ ఓటీటీపై ప్రశాంత్ వర్మ ట్వీట్.. అప్పుడే వస్తుందంటూ!

హాలీవుడ్‌లో ఎక్కువగా సూపర్ హీరోస్ బ్యాగ్‌డ్రాప్‌లో సినిమాలు వస్తుంటాయి. అలాంటి వాటికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తుంటుంది. అందుకే ఇప్పుడు ఈ తరహా చిత్రాలను ఇండియాలోని చాలా భాషల్లో ట్రై చేస్తున్నారు. అలా తెలుగులో రూపొందిన చిత్రమే 'హనుమాన్'. రియల్ సూపర్ హీరో హనుమంతుడి నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

యంగ్ గాయ్ తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమానే 'హనుమాన్'. గతంలో తెలుగులో టచ్ చేయని కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రం క్రమంగా అంచనాలను ఏర్పరచుకుని సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఆడియెన్స్ ముందుకు వచ్చింది. తర్వాత ఎవరూ ఊహించని విధంగా రూ. 300 కోట్లు గ్రాస్ రాబట్టి ఎన్నో రికార్డులను సైతం నమోదు చేసుకుంది.

Prasanth Varma Gives Clarity On HanuMan Movie Digital Streaming

విభిన్నమైన సబ్జెక్టుతో రూపొందిన 'హనుమాన్' మూవీ యాభై రోజులకు పైగానే థియేటర్లలో సందడి చేసింది. దీంతో ఇది మార్చి మొదటి వారంలోనే ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత మార్చి 8వ తేదీన స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వస్తుందని అన్నారు కానీ అలా రాలేదు. మార్చి 15న వస్తుందని అనుకున్నా ఇది కూడా జరగలేదు.

యాక్షన్ అండ్ ఫాంటసీ జోనర్‌లో రూపొందిన 'హనుమాన్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న జీ5 సంస్థ త్వరలోనే ఈ చిత్రం వస్తుందని ఇటీవలే వెల్లడించింది. కానీ, ఏ రోజున వస్తుంది అనేది మాత్రం వెల్లడించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీనిపై దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించాడు. అంతేకాదు, X (ట్విట్టర్) ఖాతాలో క్లారిటీ కూడా ఇచ్చాడు.

ప్రశాంత్ వర్మ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో 'హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్ ఆలస్యం అవడం మేము కావాలని చేసింది కాదు. మేము ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకు వచ్చేందుకు విరామం లేకుండా శ్రమిస్తున్నాము. మీకు ఉత్తమైననది ఇవ్వాలనేదే మా ఉద్దేశం. దయచేసి అర్థం చేసుకుని మాకు మద్దతుగా నిలవండి' అంటూ చెప్పాడు. దీంతో త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని అర్థం అవుతోంది.

ఇదిలా ఉండగా.. తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'హనుమాన్' మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ కంపోజ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X