Salaar : ఓటీటీని షేక్ చేస్తున్న ‘సలార్’... ప్రభాస్ దెబ్బకు రిజల్ట్ ఇలా!
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం భారీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన డైరెక్షన్ లో మొదటి 'ఉగ్రం', 'కేజీఎఫ్' సిరీస్, ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' వచ్చిన సంగతి తెలిసిందే. ఉగ్రం మినహా మిగిలిన చిత్రాలన్నీ వరల్డ్ వైడ్ గా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. చివరిగా ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబోలో ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ ఫిల్మ్ 'సలార్ : పార్ట్ 1 - సీజ్ ఫైర్' ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డార్లింగ్ ను ఊరమాస్ లో లుక్.. గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెల్స్ లో చూడాలనుకున్న అభిమానులకు ఈ చిత్రం సరిగ్గా సరిపోయింది.
2023 డిసెంబర్ 22న ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. మరోవైపు ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన షారుఖ్ ఖాన్ 'డంకీ' చిత్రం కూడా అదే రోజు విడుదలైంది. కానీ ప్రభాస్ యాక్షన్ ధాటికి నిలవలేకపోయింది. దీంతో సలార్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గర్జించిన విషయం తెలిసిందే. ఏకంగా రూ.700 కోట్ల వరకు ఈ చిత్రం వసూల్ చేసింది. కాన్ సార్ వరల్డ్ ను పరిచయం చేసిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఊచకోత కోయించారు. దీంతో ఫ్యాన్స్ కు ఈ సిరీస్ పై మరింత ఆసక్తి నెలకొంది. సలార్ : పార్ట్ 2 - శౌర్యాంగ పర్వం కోసం ఆడియెన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సలార్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులో ఉంది. ఈ చిత్రం శాలిటైల్ రైట్స్ ను డిస్నీ స్టార్, డిజిటల్ రైట్స్ లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఓటీటీలో 'సలార్' 2024 జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తొలుత తెలుగులో స్ట్రీమింగ్ జరిగింది. 2024 ఫిబ్రవరి 5నుంచి తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ జరుగుతోంది. అయితే ఈ చిత్రం ఓటీటీ ఏడాదిగా వ్యూయర్ షిప్ ను సాధిస్తూనే వస్తోంది.
సంవత్సరం పొడుగుతా ప్రభాస్ 'సలార్' ఓటీటీలో నాన్ స్టాప్ గా సట్రీమింగ్ అవుతూనే ఉంది. ఏడాదిగా ట్రెండింగ్ లోనే ఉన్న తొలిచిత్రం, ఏకైక చిత్రంగా 'సలార్' ఇండియన్ సినిమాలోనే రికార్డు క్రియేట్ చేసింది. ఓటీటీలో ఇలా ఆల్ టైమ్ రికార్డును సాధించింది. అలాగే అన్నీ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను డామినేట్ చేసింది కూడానూ. ఇక ప్రభాస్ దెబ్బకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు షేక్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
ప్రభాస్ 'సలార్' చిత్రంలో వరదరాజ్ మన్నార్ పాత్రలో మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సంగతి తెలిసిందే. దేవాకు మంచి స్నేహితుడిగా అదరగొట్టాడు. వీరిస్నేహం వైరంగా మారబోతుండటంతో 'సలార్ 2' శౌర్యాంగ పర్వంపై ఉత్కంఠ నెలకొంది. 2024 ఆగస్టులోనే సలార్ 2 సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కావాల్సింది... కానీ డిలే అయ్యింది. 2026లో సీక్వెల్ ను రిలీజ్ చేస్తామని, ఇప్పటికే కథ సిద్ధంగా ఉందని.. షూటింగ్ స్టార్ చేయడమే ఆలస్యమని గతంలో హోంబలే నిర్మాత చెప్పారు. ఇక ప్రభాస్ 'రాజాసాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్', చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ 'ఎన్టీఆర్31'పై ఫోకస్ పెట్టారు.


Click it and Unblock the Notifications











