HanuMan OTT Official ఎట్టకేలకు హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం హనుమాన్ ఓటీటీ విడుదల తేదీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం ఊరిస్తూ వస్తుందే తప్ప అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. దీంతో అభిమానులంతా ఇప్పటి వరకు నిరాశ వ్యక్తం చేస్తునే ఉన్నారు. అయితే తాజాగా ఇప్పుడు అభిమానుల నిరీక్షణకు తెర దించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అధికారికంగా ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. కానీ ఓ ట్విస్ట్ ఉంది ఇక్కడ. పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...
ప్రశంసల వర్షం
చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం హనుమాన్. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్ ముందు బ్లాస్ట్ అయింది. నిర్మాతలపై లాభాలతో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. కథతో పాటు గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులంతా థియేటర్లకు క్యూ కట్టేశారు. ఒకటి కన్నా ఎక్కువ సార్లు చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్, చిన్నపిల్లలైతే పండగ చేసుకున్నారు. సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. దీని వల్ల ఫలితంగా ప్రభాస్ ఆదిపురుష్‌పై మరోసారి నెట్టింట ట్రోలింగ్ కూడా అయింది.

ఎట్టకేలకు హనుమాన్ ఓటీటీ వివరాలు..
అసలే మూవీ లవర్స్ ఓ సినిమా రిలీజైతే చాలు ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటిది థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయితే విపరీతంగా దాని కోసమే కాపుకాసి మరీ చూస్తుంటారు. ఇప్పుడు హనుమాన్ కోసం కూడా అదే పని చేస్తున్నారు. మార్చి 2 నుంచి జీ 5లో హనుమాన్ స్ట్రీమింగ్ అవుతుందంటూ కొద్ది రోజులు ప్రచారం సాగింది. మరి కొద్ది రోజులు మార్చి 8 అని కూడా అన్నారు. కానీ హనుమాన్ మాత్రం ఇప్పటివరకు సరిగ్గా రెస్పాండ్ అవ్వకుండా దాగుడు మూతులు ఆడుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ అఫీషియల్‌గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు.
కానీ షాకింగ్ ట్విస్ట్...
కానీ ఓ ట్విస్ట్ పెట్టారు ప్రశాంత్ వర్మ. తెలుగు వెర్షన్ కాకుండా హందీ వెర్షన్ రిలీజ్ డేట్ గురించి చెప్పారు. మార్చి 16 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అన్నారు. అలాగే మరో సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. ఇదే డేట్‌న టీవీలో కూడా ప్రసారం కానుందని క్లారిటీ ఇచ్చారు. మార్చి 16న రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్ ఛానల్లో ప్రసారం కానుంది చెప్పుకొచ్చారు. ఈ వివరాలను కలర్స్ సినీప్లెక్స్ సంస్థ కూడా తమ సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది.
కాగా, యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, గెటప్ శ్రీను, సముద్రఖని, వినయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు రూ.30 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.350 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.


Click it and Unblock the Notifications











