OTTలోకి డైరెక్ట్‌గా ప్రశాంత్ వర్మ సినిమా... ఎందులో చూడాలంటే?
ఓటీటీ ప్రేక్షకులకు ప్రతివారం కొత్త సినిమాలు, సిరీసులు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఓటీటీలోకి డైరెక్టుగా ప్రశాంత్ వర్మ సినిమా రాబోతుందట. అయితే ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం హనుమాన్ కాదండోయ్. ఆయన ఎప్పుడో 8 ఏళ్లక్రితం తెరకెక్కించిన దట్ ఇజ్ మహాలక్ష్మి చిత్రం. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈ చిత్రం డైరెక్టుగా ఓటీటీలోకి రాబోతుందంటూ ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
క్రియేటివ్ డైరెక్టర్ హనుమాన్ మొదటి చిత్రం అః. ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా కల్కి అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత తేజ సజ్జాతో కలిసి.. జాంబీరెడ్డి అనే చిత్రాన్ని తెరకెక్కించగా.. ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ అదే హీరోతో కలిసి అద్భుతం అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

రాజశేఖర్ కుమార్తే శివాత్మిక హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. ఓటీటీలో రిలీజ్ అయింది. డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా రిలీజ్ అయి సూపర్ హిట్టుగా నిలిచింది. ప్రస్తుతం మళ్లీ అదే తేజ సజ్జాతో కలిసి హనుమాన్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు సిద్దంగా ఉంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనే కాదు.. పలు విదేశీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. జనవరి 12న పాన్ వరల్డ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ దర్శకుడు ప్రశాంత్ వర్మ 2014లో ఓ చిత్రాన్ని తమన్నాతో తెరకెక్కించినట్లు ఎవరికి గుర్తులేదు. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'దటీజ్ మహాలక్ష్మి'. కంగనా రనౌత్ బ్లాక్ బస్టర్ మూవీ 'క్వీన్' ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేశారు ప్రశాంత్ వర్మ. ఇక ఈ మూవీలో సిద్ధూ జొన్నలగడ్డ మరో కీలక పాత్రలో నటించారు. ఎప్పుడో 8 ఏళ్ల క్రితమే దటీజ్ మహాలక్ష్మి షూటింగ్ పూర్తి కాగా... పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.

2014లో ఈ మూవీని ప్రకటించి 2016లోనే షూటింగ్ పూర్తి చేశారు కానీ... విడుదల కాలేదు. దానికి కారణం... దక్షిణాది రీమేక్ రైట్స్ విషయంలో వివాదాలు వచ్చాయి. దీంతో దటీజ్ మహాలక్ష్మి విడుదలకు మోక్షం కలగలేదు. ఇక ఈ చిత్రం గురించి ప్రేక్షకులు సైతం మరిచిపోయారు. అయితే తాజాగా దటీజ్ మహాలక్ష్మి సినిమాను థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
థియేటర్లలో విడుదల చేస్తే ఆడియెన్స్ ఆదరిస్తారో, లేదోనన్న అనుమానాలు ఉండడంతో డైరెక్టుగా డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి తీసుకురానున్నారట మేకర్స్. దీనిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తో నిర్మాతలు సంప్రదింపులు జరిపారని సమాచారం. త్వరలోనే దటీజ్ మహాలక్ష్మీ ఓటీటీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











