HanuMan OTT: హనుమాన్ మూవీ ఓటీటీ, శాటిలైట్ పార్ట్‌నర్స్ ఇవే.. ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే?
దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిత్రం 'హనుమాన్'. ఈ మూవీ ఇప్పటికే ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. హనుమాన్ మూవీ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలే కాకుండా పలు విదేశీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా హనుమాన్ మూవీ ఓటీటీ, శాటిలైట్ పార్టనర్స్ వివరాలు బయటకు వచ్చాయి.
Recommended Video

ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్ షోలు నడుస్తున్నాయి. సినిమాకు మంచి పాజిటివ్ బజ్ నెలకొంది. ఇక సినిమా ప్రారంభంలోనే అధికారికంగా ఓటీటీ, శాటిలైట్ పార్టనర్స్ వివరాలు బయటకు వచ్చాయి. అయితే విడుదలకు ముందే ఓటీటీ, శాటిలైట్ వివరాలు బయటకు వచ్చాయి. ఇక అధికారికంగా ఓటీటీ, శాటిలైట్ పార్టనర్స్ వివరాలు సినిమా ప్రదర్శనలో తెలిపారు. ఇక ఈ సినిమాను ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 భారీ ధరకు వెచ్చించింది.

హనుమాన్ మూవీ ' జీ 5'లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇక, శాటిలైట్ పార్ట్‌నర్ విషయానికి వస్తే.. జీ టీవీలో హనుమాన్ ప్రసారం కానుందని రివిల్ చేశారు. అయితే, స్ట్రీమింగ్, టీవీ ప్రసారానికి సంబంధించి తేదీలు ఇంకా ఫిక్స్ కాలేదు. హనుమాన్ థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల తర్వాత ఓటీటీకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. థియేటర్లలో వచ్చే రెస్పాన్స్‌ను బట్టి ఈ తేదీ అటు,ఇటు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓటీటీకి వచ్చిన తర్వాతే టీవీలో ప్రసారం కానున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే... నైజాంలో 7.10 కోట్లకి డీల్ కుదిరినట్లు సమాచారం. సీడెడ్ లో చూసుకుంటే 4.05 కోట్ల బిజినెస్,ఆంధ్రాలో 9.70 కోట్లకి వరకు అమ్ముడయ్యాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ 20.70 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం.

కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం 2.01 కోట్ల వరకు జరిగింది. ఓవర్సీస్ బిజినెస్ లో 4.1 కోట్లకి హనుమాన్ రైట్స్ అమ్ముడయ్యాయి. వరల్డ్ వైడ్ హనుమాన్ ఓవరాల్ బిజినెస్ 26.65 కోట్ల వరకు జరిగింది. ఇక ఈ సినిమా హిట్ అవ్వాలంటే 27 కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తే చాలు.


Click it and Unblock the Notifications











