Hanuman OTT Business: ఫ్యాన్సీ రేటుకు హనుమాన్ ఓటీటీ రైట్స్.. ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే?
సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తున్న హనుమాన్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమా ఓటీటీ డీల్ ఫ్యాన్సీ రేటుకు జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఓటీటీ రిలీజ్ డేట్ మీద మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొత్త సంవత్సరం.. సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నాగార్జున నా సామి రంగా, మహేశ్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, వెంకటేష్ సైంథవ్ సినిమాలతో పోటీగా దిగుతున్న సినిమా తేజ సజ్జా హనుమాన్. ఈ సినిమాలతో పాటుగా రెండు తమిళ చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే తేజ సజ్జా హనుమాన్ మూవీని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.

తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఇంతకు ముందు జాంబీరెడ్డి వచ్చి సూపర్ సక్సెస్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. ఇది పాన్ ఇండియా సినిమా కాకుండా.. పాన్ వరల్డ్ సినిమా అనడం బెటర్. ఎందుకంటే.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనే కాకుండా... ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ సహా తదితర భాషల్లో రిలీజ్ కానుంది.
ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. అది కూడా దిమ్మతిరిగే రేటుకు ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ ధరకే ఈ సినిమాను కొనుగోలు చేసినట్లు సమాచారం. అన్ని భాషాలకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను జీ 5 కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఓటీటీ వివరాలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

హనుమాన్ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత అంటే.. దాదాపు 60 రోజుల తర్వాత ఓటీటీలోకి రానుందట. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ కన్ఫర్మ్ చేశారు. అయితే ఇటీవల కాలంలో ఏ సినిమా అయినా... థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజులు లోపే ఓటీటీలోకి వస్తుంది.

అయితే ఈ సినిమా మాత్రం రిలీజ్ అయిన రెండు నెలల తర్వాతే ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇక హనుమాన్ జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అవుతుండగా.. మార్చి 12 తర్వాతే ఓటీటీ విడుదల ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే... తేజ సజ్జా హీరోగా, అమృతా అయ్యార్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ గా వినయ్ రాయ్ కనిపిస్తుండగా.. వరలక్ష్మీ, గెటప్ శ్రీను, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











