OTTలోకి దిగిన సూపర్ హీరో హనుమాన్... తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సినీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఎట్టకేలకు మూవీ లవర్స్ ఎదురుచూపులు ఫలించాయి. ఓటీటీలోకి సూపర్ హీరో హనుమాన్ దిగాడు. ఇక విధ్వంసం సృష్టించేందుకు రెడీ అయిపోయాడు. శనివారం హిందీ ఛానెల్లో ప్రసారం అయిన హనుమాన్... ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ఓటీటీలోకి వచ్చేశాడు. ఆదివారం ఉదయం నుంచి ఓటీటీలో హనుమాన్ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

హనుమాన్ వచ్చేశాడు...

గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న పేరు హనుమాన్. ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు అంతా వెయిట్ చేస్తున్నారు. ఒక్క తెలుగు సినిమా లవర్సే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకులు సైతం హనుమాన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు వారందరి ఎదురు చూపులు ఫలించాయి. హనుమాన్ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయింది. పెద్ద హీరోల చిత్రాలు ఉన్నప్పటికీ.. హనుమాన్ దూసుకుపోయాడు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టాడు.

Prashanth Varma Teja Sajja HanuMan Movie Telugu Version Streaming on Zee5 OTT Full Details Here

బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం...

తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకుడు. నిర్మాతగా నిరంజన్ రెడ్డి వ్యవహారించగా.. చిన్న సినిమాగా రిలీజ్ అయి ఒక ప్రభంజనం సృష్టించింది. అమృత అయ్యార్ హీరోయిన్ గా నటించగా.. వాన ఫేం వినయ్ రాయ్ విలన్ గా నటించాడు. ఇక వెన్నల కిశోర్, సత్య, గెటప్ శ్రీను, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో తారాగణం అంతా చిన్నవాళ్లే. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నెక్ట్స్ లెవెల్ ప్రభంజనం.

Prashanth Varma Teja Sajja HanuMan Movie Telugu Version Streaming on Zee5 OTT Full Details Here

350 కోట్లకుపైగా...

హనుమాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక హిందీలోనూ దుమ్ములేపే కలెక్షన్స్ వచ్చాయి. ఈ మూవీ రిలీజ్ అయిన 3నెలలుకు ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. శివరాత్రి కానుకగా స్ట్రీమింగ్ కానుందని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే వారి ఆశలపై ఓటీటీ సంస్థ నీళ్లు చల్లింది. దీంతో హనుమాన్ మూవీ కోసం నెటిజన్స్ వరుసగా సోషల్ మీడియాలో ప్రశ్నలు సందించారు. ఇక జీ5 ఓటీటీ త్వరలో వస్తుందంటూ సర్ది చెప్పే ప్రయత్నాలు చేసింది.

Prashanth Varma Teja Sajja HanuMan Movie Telugu Version Streaming on Zee5 OTT Full Details Here

హిందీలో టెలికాస్ట్...

ఇక శనివారం రాత్రి 8 గంటలకు సినీ ప్లెక్స్ ఓటీటీలో హిందీలో టెలికాస్ట్ అయింది. తెలుగు ప్రేక్షకులకు మరింత కోపాన్ని తీసుకువచ్చింది. దానికి కారణం హిందీలో టెలికాస్ట్ అవుతుంది కానీ.. తెలుగులో ఇంకా స్ట్రీమింగ్ చేయడం లేదని నెటిజన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఇక జియో సినిమాలోనూ హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక జీ5 సంస్థ సడెన్ గా ఏమైందో తెలియదు... ఆదివారం ఉదయం నుంచి ఈ సినిమాను తమ ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఆ నష్టం వల్లే సడెన్ స్ట్రీమింగ్...

సడెన్ గా జీ5 ఓటీటీలో హనుమాన్ తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ వచ్చేసింది. ఇది చూసిన నెటిజన్స్.. హిందీలో ఎలాగూ రిలీజ్ అయింది.. దానికి తెలుగు ఆడియో కలిపి బయట హెచ్ డి ప్రింట్స్ వస్తాయని ముందు జాగ్రత్త పడి ముందుగా రిలీజ్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ చేయకపోతే.. జీ5కి భారీ నష్టం వచ్చేదని.. అందుకే చేసిందని అంటున్నారు. ఎట్టకేలకు హనుమాన్ తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. మీరు ఈ సండే ఫ్యామిలీతో కలిసి హనుమాన్ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X