OTTలో రానున్న సరికొత్త స్పై థ్రిల్లర్ 'మిషన్ తషాఫీ'.. 8 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా పెరిగిపోతుంది. అందుకే వాటిని సినీ ప్రియులు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఓటీటీల్లో వచ్చే విభిన్నమైన కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నాయి. దర్శక నిర్మాతలు సైతం థియేటర్లలో చూపించని, చెప్పలేని స్టోరీలను ఓటీటీల్లో చెబుతున్నారు. అలానే త్వరలో రానుంది మరో సరికొత్త స్రై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'మిషన్ తషాఫీ'. దీనికి ది ఘోస్ట్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సిరీస్ ఎప్పుడు? ఎందులో స్ట్రీమింగ్ అనే విషయాల్లోకి వెళితే..

వైవిధ్యమైన కంటెంట్ తో ఎప్పటికప్పుడు సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5. ఇప్పుడు మరో కొత్త యాక్షన్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'మిషన్ తషాఫీ' (Mission Tashafi). ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ లో సిమ్రాన్ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, అనీష్ కురువిల్లా, ఛత్రపతి శేఖర్, భూషణ్ కల్యాణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ప్రధాన పాత్రలకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

Praveen Sattaru Mission Tashafi Web Series Will Released In Zee5

హై ఇంటెన్స్ స్పై థ్రిల్లర్ గా రూపొందుతోన్న 'మిషన్ తషాఫీ' వెబ్ సిరీస్ రెగ్యులర్ షూటింగ్ శనివారం నుంచి ప్రారంభమైంది. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ ను ఫిల్మ్ రిపబ్లిక్ బ్యానర్ పై ప్రణతి రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే తెలుగు ఓటీటీ చరిత్రలో ఇప్పటివరకు రూపొందని విధంగా ఈ సిరీసును తెరకెక్కించనున్నారట. అందుకు జీ5 భారీగా ఖర్చు చేస్తుందని సమాచారం. ప్రముఖ అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

అంతేకాకుండా ఇప్పటివరకు చిత్రీకరించని సరికొత్త లొకేషన్లలో 'మిషన్ తషాఫీ' వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. దీన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలి ఇలా 8 భాషల్లో జీ5 వేదికగా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే జీ5లో పులి మేక, గాలివాన, రెక్కీ, హలో వరల్డ్, మా నీళ్ల ట్యాంక్, అహనా పెళ్లంట, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, వ్యవస్థ వంటి సిరీసులు ఆకట్టుకున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X