Pravinkoodu Shappu OTT : ఓటీటీలోకి మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ .. ఎందులో? ఎప్పుడంటే?
ఓటీటీల రాకతో ప్రజలకు అసలు సిసలు ఒరిజినల్ కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. గతంలో రోటీన్ కమర్షియల్ సినిమాలు చూసి చూసి చిరాకు పడిన ప్రజలకు కొత్త తరహా కంటెంట్ మంచి వినోదాన్ని అందించింది. యాక్షన్, సస్పెన్స్, క్రైమ్, హార్రర్, థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే వారికి ఓటీటీ బాగా కనెక్ట్ అయ్యింది. ప్రతిరోజూ వందలాది వెబ్ సిరీస్‌లు, సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగానే ఓటీటీ సంస్థలు సైతం ఆ తరహా కంటెంట్‌ను తీసుకొస్తున్నాయి.
కోవిడ్ సమయంలో మలయాళ చిత్రాల రేంజ్ పెరిగిపోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. చాలా తక్కువ బడ్జెట్‌లో ప్రజలకు వినోదాన్ని అందించడంలో మలయాళ చిత్రాలు ముందుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీస్ తెరకెక్కించడంలో మలయాల దర్శకులకు కొట్టిన పిండి. దీంతో కేరళ సినిమాకు కూడా మంచి ప్రోత్సహం లభిస్తుంది. పాన్ ఇండియా కల్చర్ దెబ్బకి మలయాళ నటులు, దర్శకులు, టెక్నీషియన్స్‌కు అవకాశాలు వస్తున్నాయి.

ఇటీవలి కాలంలో మలయాళంలో వచ్చిన రేఖా చిత్రం, సూక్ష్మదర్శిని తదితర చిత్రాలు ఘన విజయాలు అందుకోవడంతో పాటు ఓటీటీలోనూ మంచి వ్యూయర్‌షిప్ అందుకున్నాయి. ఈ కోవలోనే మరో మలయాల క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంది. అదే ప్రావింకూడు షప్పు. శోభిన్ షాహిర్, బాసిల్ జోసెఫ్, చెంబన్ వినోద్ జోస్, చాందిని శ్రీధరన్, శివజిత్, శబరీష్ వర్మ తదితరులు కీలకపాత్ర పోషించిన ఈ చిత్రానికి శ్రీరాజ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.
అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అన్వర్ రషీద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విష్ణు విజయ్ స్వరాలు సమకూర్చిన ప్రావింకూడు షప్పు చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 16న విడుదల చేశారు. అతి తక్కువ బడ్జెట్‌తో తెరెకెక్కిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది. హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన వారిని హీరో ఎలా పట్టుకున్నాడు? కేసు చిక్కుముడులు విప్పే క్రమంలో హీరోకు ఎలాంటి పరిస్ధితులు ఎదురయ్యాయి? అనేదే ప్రావింకూడు షప్పు సినిమా కథ.
థియేట్రికల్ రన్ ముగిసేనాటికి ఈ సినిమా రూ.18 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా? అని ఆ సెక్షన్ ఆడియన్స్ ఎదురుచూశారు. రిలీజై దాదాపు 3 నెలలే పైనా అవుతున్నా స్ట్రీమింగ్ ఆలస్యం కావడంతో సస్పెన్స్ నెలకొంది. అయితే చిత్ర యూనిట్ ఈ నిరీక్షణకు తెరదించింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో అడుగుపెడుతుందని తెలిపారు. ప్రావింకూడు షప్పుపై ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫాం వేదికగా ఏప్రిల్ 11 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్‌లో సక్సెస్ అయిన ప్రావింకూడు షప్పు ఓటీటీలో ఏ మేరకు సక్సెస్ కొడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











