Prem Kumar OTT: ఓటీటీలోకి వచ్చేసిన ప్రేమ్ కుమార్, ఎక్కడ చూడాలంటే?
Prem Kumar OTT: సంతోష్ శోభన్ హీరోగా నటించిన తాజా చిత్రం "ప్రేమ్ కుమార్". ఈ చిత్రంతోనే నటుడు, రచయిత అయిన మహర్షి దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సారంగ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, కృష్ణ తేజ, రుచిత సాధినేని ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం ఎలాంటి సమాచారం లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా సందడి చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా రాశీ సింగ్ ఈ విషయాన్ని తెలిపింది. కేవలం విషయమే కాకుండా రాశీ సింగ్ ఓ పోస్టర్ ను అభిమానులతో పంచుకుంది.
ఈ సినిమా ఆగస్టు 18వ తేదీన థియేటర్లలో విడుదల కాగా.. అక్టోబర్ 13వ తేదీన అంటే ఈరోజు అమెమాజ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని.. ఇంట్లోనే కూర్చొని చూస్తూ అభిమానులు ఎంజాయ్ చేయవచ్చు. సినిమా మొదట్లో బాగానే ఉన్నప్పటికీ... ఆ తర్వాత క్రమక్రమంగా ఆసక్తి తగ్గించేలా ఉందంటూ పెద్ద ఎత్తున కామెంట్లు వచ్చాయి. ఈక్రమంలోనే థియేటర్ల వద్ద సినిమా పెద్దగా ఆడలేకపోయింది.

ప్రేమ్ కుమార్ అలియాస్ పీకే అంటే సంతోష్ శోభన్ ఈ సినిమాలో వెడ్డింగ్ డిటెక్టివ్ గా చేశారు. తన స్నేహితుడు సుందర్ లింగ్ అంటే కృష్ణ తేజతో కలిసి పెళ్లిళ్లు చెడగొడుతూ.. ప్రేమికుల్ని విడగొడుతూ డబ్బులు సంపాధిస్తూ ఉంటారు. ప్రేమ్ కుమార్ కి కూడా అలాంటి ఫ్లాష్ బ్యాక్ యే ఉంటుంది. మరికాసేపట్లో నేత్ర అంటే రాశీ సింగ్ మెడలో మూడు ముళ్లు వేస్తాడనగా.. అంతలోనే రైజింగ్ స్టార్ రోషన్ (కృష్ణ చైతన్య) మండపంలోకి వస్తాడు. తాను నేత్రను ప్రేమిస్తున్నట్లు పాత సినిమాలో చెప్పినట్లు మాటలు చెప్తాడు. చివరకు పెళ్లి ఆగిపోయేలా చేస్తాడు. తనతో పాటు నేత్రను తీసుకొని వెళ్లిపోతాడు.

అలా నేత్రతోనే కాకుండా మరో ఇద్దరితో కూడా ప్రేమ్ కుమార్ పెళ్లి మండపం దాకా వచ్చి పెటాకులు అవుతుంది. ఆ తర్వాత ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ ఆయనకు పెళ్లి కాలేదు. అలా తను పెళ్లి కాకుండా విపరీతమైన కష్టాలు పడుతూ ఉంటాడు. ఈక్రమంలోనే తన పని తాను చేసుకుంటూ జీవిస్తాడు. ఈక్రమంలోనే నేత్ర మరోసారి తన వ్యాపారంలో అడ్డు వస్తుంది. మరోవైపు రోషన్ నేత్రని కాకుండా అంగనని పెళ్లి చేసుకుంటాడు. అయితే రోషన్ అంగనను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి, రోషన్ వేరే వాళ్లని పెళ్లి చేసుకోవడంతో నేత్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదే ప్రేమ్ కుమార్ సినిమా.

మరి ఈ సినిమాలో ప్రేమ్ కుమార్ కు పెళ్లి జరిగిందా లేదా.. నేత్ర పరిస్థితి ఏమైందో తెలియాలంటే కచ్చితంగా ఈ చిత్రం చూడాల్సిందే. థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని ఈ సినిమా చూసే అవకాశం వచ్చింది కాబట్టి.. హ్యాపీగా సినిమా చూసేయండి. ఏం జరిగిందో తెలుసుకోండి.


Click it and Unblock the Notifications











