ఓటీటీలోకి సూపర్ హిట్ లవ్ స్టోరీ మూవీ.. 100 కోట్ల సినిమాను ఎందులో చూడాలంటే!

యూత్‌ఫుల్ లవ్ స్టోరీలతో తెరకెక్కే చిత్రాలకు అన్ని భాషల్లో అద్భుతమైన స్పందన లభిస్తోంది. అందుకే ఈ మధ్య కాలంలో ఇలాంటి చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రం ఆరంభంలోనే హాట్ టాపిక్ అవుతోన్నాయి. అలాంటి చిత్రాల్లో ఒకటే 'ప్రేమలు'. మలయాళంలో రూపొందిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా హైలైట్ అయిన విషయం తెలిసిందే.

నస్లెన్ కే గఫూర్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో గిరీష్ ఏడీ రూపొందించిన సినిమానే 'ప్రేమలు'. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ లభించింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే వచ్చింది. ఫలితంగా ఈ సినిమా మలయాళంలో వంద కోట్ల వసూళ్లను రాబట్టింది.

Premalu Movie Digital Streaming Date Locked

మలయాళంలో సెన్సేషనల్ హిట్ అయిన 'ప్రేమలు' చిత్రాన్ని ఇటీవలే తెలుగులో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి ఇక్కడ కూడా అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం 6 రోజుల్లోనే రూ. 1.50 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. తద్వారా తెలుగులో కూడా హిట్ స్టేటస్‌ను చేరుకుంది. అలా మరిన్ని లాభాల దిశగా ప్రయాణం సాగిస్తోంది.

ఫన్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ప్రేమలు' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ రేటుకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్‌పై డేట్ బయటకు వచ్చింది.

Premalu Movie Digital Streaming Date Locked

సంచలన విజయాన్ని అందుకున్న 'ప్రేమలు' మూవీ స్ట్రీమింగ్ నాలుగు వారాల తర్వాతనే అనుకున్నారు. కానీ, తెలుగులో సైతం విడుదల కావడంతో అది లేట్ అయింది. ఇక, ఇప్పుడు ఈ చిత్రం మార్చి 29వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రాబోతుందని తెలిసింది. దీనిపై ఈ వారంలోనే అధికారిక ప్రకటన రాబోతుందని మరో న్యూస్ బయటకు వచ్చేసింది.

ఇదిలా ఉండగా.. 'ప్రేమలు' మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్ (పుష్ప విలన్), దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు. విష్ణు విజయ్ దీనికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో నస్లెన్ కే గఫూర్, మమితా బైజు, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్‌తో పాటు శ్యామ్ మోహన్, సంగీత్ ప్రతాప్, మాథ్యూ థామస్ తదితరులు కీలక పాత్రల్లో నటించి అలరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X