ఓటీటీలోకి రాజమౌళి కొడుకు ఫస్ట్ మూవీ.. ఏ రోజు నుంచి వస్తుందో తెలిస్తే!

ఇండియాలోని ఏ సినిమా ఇండస్ట్రీ కూడా సొంత భాషకే పరిమితం కావడం లేదు. అందుకే ఈ మధ్య కాలంలో ఏ లాంగ్వేజ్‌లో వచ్చిన మంచి కంటెంట్ మూవీ అయినా.. వేరే చోట్ల కూడా మంచి స్పందనను అందుకుని సూపర్ హిట్ అవుతోంది. ఇలా ఇటీవలే మలయాళంలో రూపొంది.. విడుదలైన ప్రతి చోటా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ప్రేమకథా చిత్రమే 'ప్రేమలు'.

నస్లెన్ కే గఫూర్, మమితా బైజు జంటగా గిరీష్ ఏడీ అనే దర్శకుడు తీసిని సినిమానే 'ప్రేమలు'. హైదరాబాద్ లవ్ స్టోరీ నేపథ్యంతో రూపొందిన ఈ మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ లభించింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే వచ్చింది. ఫలితంగా ఈ సినిమా మలయాళంలో వంద కోట్ల వసూళ్లతో రికార్డులు సాధించింది.

Premalu Movie Digital Streaming From April 12th on Hotstar

మలయాళంలో సత్తా చాటిన 'ప్రేమలు' చిత్రాన్ని రాజమౌళి కుమారుడు కార్తికేయ మార్చి 8వ తెలుగులో విడుదల చేశాడు. డిస్ట్రిబ్యూటర్‌గా మొదటి చిత్రమే తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేశాడు. అతడి నమ్మకాన్ని నిలబెడుతూ ఈ చిత్రం రూ. 20 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా తెలుగులో కూడా హిట్ స్టేటస్‌ను చేరుకుని లాభాలను కూడా అందించింది.

లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ప్రేమలు' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు భారీగానే పోటీ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను అదిరిపోయే ధరకు దక్కించుకుంది. అంతేకాదు, దీన్ని మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ చేసేలా ఆ సంస్థ ప్లాన్ చేసుకుంది.

'ప్రేమలు' మూవీ మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, తెలుగు, తమిళంలో ఆలస్యంగా విడుదల కావడంతో స్ట్రీమింగ్ కూడా వాయిదా వేశారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ అందుబాటులోకి తీసుకు రాబోతుందట. దీనిపై కొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని టాక్.

Premalu Movie Digital Streaming From April 12th on Hotstar

ఇదిలా ఉండగా.. క్రేజీ లవ్ స్టోరీతో రూపొందిన 'ప్రేమలు' మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్ (పుష్ప విలన్), దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు. విష్ణు విజయ్ దీనికి సంగీతం ఇచ్చారు. ఈ చిత్రంలో అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్‌తో పాటు శ్యామ్ మోహన్, సంగీత్ ప్రతాప్, మాథ్యూ థామస్ తదితరులు కీలక పాత్రలలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X