వంద కోట్ల హిట్ సినిమా ఓటీటీ వాయిదా.. దీని వెనుక రాజమౌళి హస్తం ఉందా?
తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాకైనా అదిరిపోయే స్పందన అందించి సూపర్ డూపర్ హిట్ చేస్తుంటారు. ఇలా ఈ మధ్య కాలంలోనే వేరే భాషల్లో వచ్చిన చాలా చిత్రాలను అక్కున చేర్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే మరో సినిమాను ఆదరించారు. అదే మలయాళంలో రూపొంది సెన్సేషన్ క్రియేట్ చేసిన 'ప్రేమలు' మూవీ.
నస్లెన్ కే గఫూర్, మమితా బైజు జంటగా గిరీష్ ఏడీ రూపొందించిన సినిమానే 'ప్రేమలు'. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ లభించింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే వచ్చింది. ఫలితంగా ఈ సినిమా మలయాళంలో వంద కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించింది.

'ప్రేమలు' చిత్రాన్ని రాజమౌళి కుమారుడు కార్తికేయ మార్చి 8వ తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి ఇక్కడ కూడా అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం రూ. 20 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా తెలుగులో కూడా హిట్ స్టేటస్‌ను చేరుకుంది. అదే సమయంలో జక్కన్న కొడుకుకు భారీ లాభాలను కూడా అందించేసింది.
కామెడీ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ప్రేమలు' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు దక్కించుకుంది. అంతేకాదు, దీన్ని మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ చేసేలా ప్లాన్ కూడా చేసుకుంది.

ప్రేమలు' మూవీ మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. అంతేకాదు, ఈ చిత్రం ఏప్రిల్ 5 లేదా 12 నుంచి స్ట్రీమింగ్ అవబోతుందని తెలిసింది. దీనికి కారణం ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండడమే అని తెలిసింది. కొందరైతే రాజమౌళి రిక్వెస్ట్ చేయడం వల్లే వాయిదా వేశారని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. 'ప్రేమలు' మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్ (పుష్ప విలన్), దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు. విష్ణు విజయ్ దీనికి సంగీతం ఇచ్చారు. ఈ చిత్రంలో నస్లెన్ కే గఫూర్, మమితా బైజు, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్‌తో పాటు శ్యామ్ మోహన్, సంగీత్ ప్రతాప్, మాథ్యూ థామస్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











