ప్రేమలు తెలుగు వెర్షన్ ఓటీటీ ఫిక్స్.. ఎందులో ఎప్పుడు వస్తుందంటే!
సాధారణంగా ప్రతి ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో హైదరాబాద్ లవ్ స్టోరీ నేపథ్యంతో వచ్చిన 'ప్రేమలు' మూవీ ఒకటి. మలయాళంలో రూపొందిన ఈ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా సెన్సేషన్ అయింది.
నస్లెన్ కే గఫూర్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో గిరీష్ ఏడీ అనే డైరెక్టర్ తెరకెక్కించిన సినిమానే 'ప్రేమలు'. హైదరాబాద్ లవ్ స్టోరీ నేపథ్యంతో రూపొందిన ఈ మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ లభించింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే వచ్చింది. ఫలితంగా రూ. 135 కోట్లకు పైగా గ్రాస్‌తో ఈ మూవీ చరిత్రను సృష్టించింది.

'ప్రేమలు' చిత్రాన్ని రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ మార్చి 8వ తెలుగులో విడుదల చేశాడు. డిస్ట్రిబ్యూటర్‌గా మొదటి చిత్రమే తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేశాడు. అతడి నమ్మకాన్ని నిలబెడుతూ ఈ చిత్రం రూ. 20 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది. ఆ తర్వాత ఈ చిత్రం తమిళంలో కూడా విడుదలైంది. అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.
కామెడీ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ప్రేమలు' మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు భారీగానే పోటీ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను అదిరిపోయే ధరకు దక్కించుకుంది. అంతేకాదు, దీన్ని ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించేసింది.

'ప్రేమలు' మూవీని హాట్‌స్టార్ తెలుగులో స్ట్రీమింగ్ చేయడం లేదని కూడా ప్రకటించింది. దీంతో మరి ఈ చిత్రం ఏ ఓటీటీకి వెళ్లిందని అంతా అయోమయంలో ఉండిపోయారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా తెలుగు స్ట్రీమింగ్ రైట్స్‌ను ఆహా సంస్థ దక్కించుకుందట. హాట్‌స్టార్‌లాగే దీన్ని కూడా ఏప్రిల్ 12వ తేదీ నుంచే స్ట్రీమ్ చేస్తుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. క్రేజీ లవ్ స్టోరీతో రూపొందిన 'ప్రేమలు' మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్ (పుష్ప విలన్), దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు. ఈ చిత్రంలో అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్‌తో పాటు శ్యామ్ మోహన్, సంగీత్ ప్రతాప్, మాథ్యూ థామస్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. విష్ణు విజయ్ దీనికి సంగీతం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











