Premalu ఓటీటీలోకి ప్రేమలు తెలుగు వెర్షన్.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

భావన స్టూడియోస్ బ్యానర్‌పై గిరీష్ ఏడీ దర్శకత్వంలో మలయాళ భాషలో రూపొందిన చిత్రం ప్రేమలు. ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరణ్ నిర్మాతలుగా తెరకెక్కించిన ఈ చిత్రంలో నస్లేన్, మమితా, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సంగీత్ ప్రతాప్, షమీర్ ఖాన్, శ్యామ్ మోహన్ ఎం తదితరులు నటించారు. ఈ సినిమా మలయాళంలో ఫిబ్రవరి 9వ తేదీన, తెలుగులో మార్చి 8వ తేదీన రిలీజైంది. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ ఓటీటీలో రిలీజ్ అవుతున్నది. ఈ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌గా రూపొదిన ఈ చిత్రం మలయాళ భాషలో రిలీజై అనూహ్యమైన రెస్పాన్స్‌ను కూడా గట్టుకొన్నది. ఈ చిత్రానికి అన్ని భాషల్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మలయాళం వెర్షన్ దేశంలోని ప్రధాన నగరాల్లో రిలీజై భారీ వసూళ్లు సాధించింది. 5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 150 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది.

Premalu Telugu Version release on OTT Where and When to See details

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ప్రేమలు చిత్రం మలయాళంలో రికార్డు వసూళ్లను నమోదు చేసింది. ఈ మూవీ మలయాళంలో 56 కోట్ల రూపాయల షేర్, తెలుగులో 12 కోట్ల రూపాయల షేర్, తమిళంలో కోట్ల మేర వసూళ్లు సాధించింది. దాంతో అతిపెద్ద విజయం సాధించిన చిన్న బడ్జెట్ చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది.

ప్రేమలు సినిమాను తెలుగులో రాజమౌళి కుమారుడు కార్తికేయ తొలిసారి డిస్టిబ్యూటర్‌గా, నిర్మాతగా అవతారం ఎత్తి ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేశాడు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకొన్న ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రాబోతున్నది. ఈ చిత్రం ఓటీటీ వివరాల్లోకి వెళితే..

Premalu Telugu Version release on OTT Where and When to See details

ప్రేమలు తెలుగు వెర్షన్ మూవీని ప్రముఖ ఓటీటీ ఆహా రిలీజ్ చేస్తున్నది. ఈ మూవీని ఏప్రిల్ 12 తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. థియేట్రికల్‌ రిలీజ్‌ను చూడలేకపోయిన ఆడియెన్స్ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటలో కూడా మంచి రెస్పాన్స్‌ను, కూడగట్టుకొంటుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X