OTT: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 10 సినిమాలు.. వాటిని మీరు చూశారా?
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో ఓటిటి సంస్థల్లో టాప్ లో నిలిచే వాటిలో మాత్రం గట్టి పోటీ ప్రదర్శించుకునే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో డిస్నీ హాట్ స్టార్ లాంటివి ఉంటాయని చెప్పాలి. కాగా ఈ లిస్ట్ లో అయితే భారీ సంఖ్యలో పైడ్ సబ్ స్క్రైబర్ లు ఉన్నది మాత్రం ఓటిటి కింగ్ నెట్ ఫ్లిక్స్ లోనే అని చెప్పాలి.
కాగా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ ని అది కూడా మంచి క్వాలిటీలో తీసుకురావడంలో నెట్ ఫ్లిక్స్ వారు ముందుంటారు. అలా గ్లోబల్ గా ఈ మధ్య కొన్ని రోజుల్లోనే సాలిడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లని వారు తీసుకొచ్చారు. అలా ఇప్పుడు మన దేశంలో కొన్ని సినిమాలు అయితే టాప్ 10 లో ట్రెండ్ అవుతున్నాయి.

మరి ఆ సినిమాలు ఏంటి?మనవాళ్ళు ఏ సినిమాలు ఇపుడు టాప్ లో ఉంచారు? ఎన్ని తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు ఉన్నాయి హాలీవుడ్ నుంచి కూడా ఏమన్నా ఉన్నాయా అనేది తెలుసుకుందాం. ముందుగా టాప్ 10 నుంచి చూస్తే..
టాప్ 10, 9 స్థానాల్లో
మన దేశంలో ప్రస్తుతం టాప్ 10వ స్థానంలో హాలీవుడ్ సినిమా ఉంది. ఒక యంగ్ అమ్మాయికి చెందిన మిస్టీరియస్ గతానికి సంబంధించిన సినిమాగా ఇది నెట్ ఫ్లిక్స్ లో రీసెంట్ గానే రాగా దీనికి దీనికి మంచి రెస్పాన్స్ వస్తూ టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాని మకియేజ్ కవుల్స్కి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఒరిజినల్ గా పోలిష్ భాషకి చెందింది కాగా ఇంగ్లీష్ లో కూడా అందుబాటులో ఉంది. ఇక టాప్ 9 చూసినట్టు అయితే రీసెంట్ గా బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ అయ్యిన చిత్రం "ఆర్టికల్ 370" ట్రెండ్ అవుతుంది. యంగ్ హీరోయిన్ గౌతమ్ మెయిన్ లీడ్ లో నటించింది. ఈ సినిమా హిందీలో అందుబాటులో ఉండగా ఆదిత్య సుహాస్ దర్శకత్వం వహించారు.

టాప్ 8, 7 ర్యాంకింగ్‌లో
మరి టాప్ 8లో చూసుకున్నట్టు అయితే ఇక్కడ కూడా మరో హాలీవుడ్ సినిమా ఉంది. డైరెక్టర్ గ్యారీ షోర్ తెరకెక్కించిన "డ్రాకులా అన్ టోల్డ్" అనే హారర్ సినిమా వీక్షకులని అలరిస్తుంది. కాగా ఈ చిత్రం ఒరిజినల్ ఇంగ్లీష్ సహా మన తెలుగులో కూడా అందుబాటులో ఉంది. చూడాలి అనుకుంటే చూడొచ్చు. టాప్ 7 లో మన ఇండియన్ సినిమా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, మాధవన్ లు నటించిన స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్ "సైతాన్" అనే సినిమా ఉంది. కాగా ఈ సినిమాలో జ్యోతిక ఫీమేల్ లీడ్ లో నటించగా ఈమె బాలీవుడ్ లో మొదటిగా చేసిన సినిమా ఇదే. హిందీలో భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రాన్ని వికాస్ బాహి దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమా కేవలం హిందీలో అందుబాటులో ఉంది.
టాప్ 6, 5 స్థానాల్లో
ఇక్కడ కూడా హాలీవుడ్ సినిమా ట్రెండింగ్ లో ఉండడం విశేషం. హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకి పెట్టింది పేరు అయిన మార్వెల్ సూపర్ హీరో "స్పైడర్ మ్యాన్ నో వే హోమ్" ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాని జాన్ వాట్స్ తెరకెక్కించగా ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఇక టాప్ 5 లిస్ట్ లోకి వచ్చినట్టు అయితే ఇందులో కూడా హాలీవుడ్ సినిమా ట్రెండింగ్ అవుతుంది. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన అండర్ పారిస్ అనే సినిమా సొర చేపల నేపథ్యంలో తెరకెక్కించబడింది. తమంత తామే పిల్లలు కనగలిగే ఓ సొర చేప ప్యారిస్ కలిగించే విధ్వంసమే ఈ కథ. కాగా ఈ చిత్రాన్ని జావియర్ జీన్స్ తెరకెక్కించగా ఈ సినిమా ఇంగ్లీష్ సహా తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
టాప్ 4, 3 స్థానాల్లో
ఇందులో రీసెంట్ బాలీవుడ్ హిట్ చిత్రం "క్రూ" ఉంది. సీనియర్ నటి టబు, కరీనా కపూర్ అలాగే యంగ్ హీరోయిన్ కృతి సనన్ లు ప్రధాన పాత్రల్లో పోషించిన ఈ లేడీ ఓరియేంటేడ్ సినిమా బాలీవుడ్ లో మంచి వసూళ్లు సాధించి అదరగొట్టింది. ఈ సినిమాని రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించగా హిందీలో అందుబాటులో ఉంది. టాప్ 3 లో కూడా మరో బాలీవుడ్ హిట్ సినిమా "లాపతా లేడీస్" నిలిచింది. ఈ సినిమా కూడా మంచి మౌత్ టాక్ ని తెచ్చుకొని ఓటిటిలో వచ్చాక బాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాని కిరణ్ రావు దర్శకత్వం వహించగా హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది.

టాప్ 2, 1 ర్యాంకింగ్‌లో
మొత్తానికి టాప్ 2 లో అయితే మన తెలుగు సినిమా నిలిచింది అని చెప్పాలి. మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇండియా వైడ్ గా టాప్ 2 లో ఉంది అలాగే ఈ సినిమాని కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఇక ఇండియా వైడ్ గా నెంబర్ 1 సినిమాని చూసినట్టు అయితే రీసెంట్ బాలీవుడ్ ప్లాప్ చిత్రం "బడేమియా చోటేమియా" నిలిచింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లు నటించిన ఈ భారీ ఏక్షన్ డ్రామాలో పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా నటించాడు. అలాగే ఆలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications











