సూసైడ్‌కి ఆ గేమ్‌కి లింకేంటీ , ఓటీటీలోకి ఆ సైకలాజికల్ థ్రిల్లర్.. ఎందులో, ఎప్పుడు?
థియేటర్‌లో కంటే ఓటీటీలో సస్పెన్స్, క్రైమ్, హార్రర్ , థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. స్క్రీన్‌పై ఫెయిలైన సినిమాలు ఓటీటీలో ఘన విజయాన్ని అందుకున్న ఉదంతాలెన్నో. కొన్ని సినిమాలు పట్టుమని వారం వ్యవధిలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ ఇచ్చేస్తూ షాకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యువ హీరో ప్రిన్స్ సిసిల్, నరేష్ అగస్త్య కలిసి నటించిన కలి సినిమా ఓటీటీ రిలీజ్‌ను కన్ఫర్మ్ చేసింది . ఆ వివరాల్లోకి వెళితే:
ఎప్పుడో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రిన్స్ చిన్నా చితకా సినిమాలు తప్పించి చెప్పుకోదగ్గ బ్రేక్ సాధించలేకపోయాడు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. ప్రిన్స్ నటించిన లేటెస్ట్ మూవీ కలి. ఈ సినిమాకు శివ శేషు దర్శకత్వం వహించారు. ఇందులో నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, మణిచందన, మధుమణి, గుండు సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు. రుద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై లీలా గౌతమ్ వర్మ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

పెద్దలు సంపాదించిన ఇచ్చిన ఆస్తులతో లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేసే శివరాం (ప్రిన్స్) ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. మంచితనానికి మారుపేరుగా నిలిచే శివరాం ఎవరికైనా ఆపద వస్తే సాయం చేసేందుకు ముందుంటాడు. అతనిలోని ఈ మంచితనం నచ్చే వేద(నేహా కృష్ణన్) ప్రేమించి, పెద్దలను ఎదురించి మరి పెళ్లి చేసుకొంటుంది. అయితే నా అనుకున్నవాళ్లే మోసం చేయడంతో శివరాం ఆస్తులన్నీ పోగొట్టుకొంటాడు. చివరికి భార్య కూడా బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన శివరాం ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు.
శివరాం అసలు తన ఆస్తులను ఎలా పొగొట్టుకొన్నాడు? ధనవంతుడిగా గొప్పస్థాయిలో ఉన్న వ్యక్తి అనూహ్యంగా పేదరికంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? ఈ క్రమంలో శివరాంకు ఎదురైన సమస్యలు ఏమిటి? శివరాం నిజంగా ఆత్మహత్య చేసుకొన్నాడా? శివరాంను కలిసిన కలి ఎవరు, అతనికి ఎందుకు ఎదురుపడ్డాడు? శివరాం, కలి మధ్య నడిచిన ఆట ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే కలి మూవీ కథ. ప్రిన్స్, అగస్త్య తమ పాత్రలకు న్యాయం చేయగా.. ఈ డ్రామాలో మరింతగా ఎమోషన్స్ జొప్పించి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని క్రిటిక్స్ తమ రివ్యూలలో రాసుకొచ్చారు.
Introducing the gripping and well-crafted action-thriller film, #Kali. Watch the trailer now!
— ETV Win (@etvwin) October 13, 2024
From this oct 17
Only on @etvwin#EtvWin#Prince #NareshAgastya pic.twitter.com/kmw9Sn13zb
ఎమోషనల్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడంతో సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని ఓటీటీలో దిగాలని డిసైడ్ అయ్యింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా రిలీజ్ కావడంతో కలి మూవీ ఓటీటీ రైట్స్‌కు మంచి ధర పలికింది. తొలుత ఓటీటీలోనే సినిమాను నేరుగా రిలీజ్ చేయాలని అనుకున్నారట మేకర్స్. కానీ లాస్ట్ మినిట్‌లో థియేటర్‌లోనూ విడుదల చేశారు. ప్రముఖ తెలుగు ఓటీటీ దిగ్గజం ఈటీవీ విన్ ఈ సినిమాను స్వల్ప మొత్తంలోనే వెచ్చించి కొనుగోలు చేసిందని టాలీవుడ్ టాక్. థియేటర్ రన్ పూర్తి కావడంతో ఈటీవీ విన్.. ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. దీనిలో భాగంగా అక్టోబర్ 17 నుంచి కలి .. ఓటీటీలో అందుబాటులో ఉంటుందని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. మరి శివరాంకి , కలికి మధ్య ఏం జరిగిందో, శివరాం తన సమస్యలను ఎలా అధిగమించాడో చూసేయండి.


Click it and Unblock the Notifications











