Pritam & Pedro Trailer Review: ప్రీతం అండ్ పెడ్రో ట్రైలర్ రివ్యూ: సినీ పరిశ్రమకు మరో వారసుడు రెడీ

బాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో వారసుడు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి అ్గ్ర నటులతో 3 ఇడియెట్స్, పీకే లాంటి సినిమాలను నిర్మించి బాక్సాఫీస్‌ను దద్దరిల్లేలా చేసిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత రాజ్ కుమార్ హిరానీ వారసుడిగా వీర్ హిరానీ ప్రీతమ్ అండ్ పెడ్రో అనే వెబ్ సిరీస్ ద్వారా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను సోమవారం జూన్ 15వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వీర్ హిరానీతోపాటు అర్షద్ వార్సీ, విక్రాంత్ మెస్సీ, మోనాసింగ్, బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ జూలై 3వ తేదీన గ్రాండ్‌గా జియో హాట్ స్టార్‌లో రిలీజ్ అవుతున్నది. పోలీస్ డ్రామాకు సంబంధించిన ఈ ట్రైలర్ రివ్యూ మీకోసం..

ప్రీతమ్ అండ్ పెడ్రో వెబ్ సిరీస్ గోవా బ్యాక్ డ్రాప్‌గా రూపొందించారు. ఈ సినిమా నేపథ్యం డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. పెడ్రో అనే సంప్రదాయ పోలీస్ ఆఫీసర్, అలాగే టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్‌తో ఉండిన ప్రీతమ్ అనే యువకుడి మధ్య జరిగే కథగా తెర మీదకు తీసుకొచ్చారు. ఇద్దరు విభిన్నమైన వ్యక్తుల మధ్య సంఘర్షణను రాజ్ కుమార్ హిరానీ తనదైన శైలిలో చెప్పబోతున్నారనే విషయం ట్రైలర్ ద్వారా దర్శకుడు అవినాష్ అరుణ్ స్పష్టం చేశారు.

Pritam amp amp Pedro Trailer Review

ఈ వెబ్ సిరీస్‌లో అర్షద్ వార్సీ, విక్రాంత్ మెస్పీ, విర్ హిరానీ, మోనా సింగ్, బోమన్ ఇరానీ పాత్రలు హైలెట్ కానున్నాయి. ఈ వెబ్ సిరీస్‌కు రాజ్ కుమార్ హిరానీ హ్యుమానిటీ, హ్యుమర్, ఇంటెన్పిటీ, సమకాలీన సామాజిక పరిస్థితులు హైలె9ట్‌గా మారనున్నాయి. ఈ సిరీస్‌లో చెప్పే స్టోరీ టెల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ప్రేక్షకులకు కొత్తగా ఉండబోతున్నది అనేది చర్చనీయాంశంగా మారింది.

టెక్నాలజీ తెలియని పోలీస్ ఆఫీసర్‌గా అర్షద్ వార్సీ , టెక్నాలజీ అవగాహన పెంచుకొన్న యువకుడిగా వీర్ ఇద్దరి మధ్య డ్రామా ఆసక్తికరంగా ఉండబోతున్నదనే విషయం ట్రైలర్ ద్వారా చెప్పారు. బలమైన కథతో తనదైన హ్యుమర్‌ను జోడించి రాజ్‌కుమార్ హిరానీ తనదైన శైలిలో ఈ సిరీస్‌ ద్వారా తన కుమారుడి ఆరంగ్రేట్రానికి వేదికను సిద్దం చేశారు.

ఈ వెబ్ సిరీస్‌లో కీలక నటుడిగా పరిచయం కాబోతున్న వీర్ హిరానీ మాట్లాడుతూ.. ఈ సినిమా ఇండస్ట్రీలో కథను గొప్పగా చెప్పే నటీనటులతో కలిసి ట్రావెల్ చేయడం, వారితో కలిసి పెర్ఫార్మ్ చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. సెట్‌లో షూటింగ్ ప్రతీ రోజు నాకు ఓ మాస్టర్ క్లాస్‌లా ఉండేది. అర్షద్ వార్సీ సునాయసంగా హ్యుమర్ పలికించే విధానం చూస్తే నాకు స్పూర్తిని కలిగించింది. విక్రాంత్, మోనాసింగ్ నుంచి వచ్చే సహజ నటనను చూసి ఆశ్చరపోయాను. దర్శకుడు అవినాష్ నుంచి చాలా నేర్చుకొన్నాను. నటనా ప్రపంచంలోకి అడుగుపెడుతున్న నాకు ఇలాంటి వాతావరణం దొరకడం ఆనందంగా ఉంది. ప్రీతమ్ అండ్ పెడ్రో ద్వారా ఆడియెన్స్ కొత్త అనుభూతిని పొందడం గ్యారెంటీ అని అన్నారు.

Read more about: rajkumar hirani arshad warsi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X