Court OTT Release: ఓటీటీలోకి కోర్ట్ .. నాని మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే?
తన విలక్షణ నటనతో దూసుకెళ్తున్నారు ప్రియదర్శి. కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన తనలోని నటుడిని కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు. మల్లేశం, బలగం వంటి సినిమాలతో ఏడిపించారు కూడా. కమెడియన్‌గా నటిస్తూనే అప్పుడప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో అలరిస్తున్నారు ప్రియదర్శి. లేటెస్ట్‌గా ప్రియదర్శి నటించిన చిత్రం కోర్ట్ . నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రియదర్శి సినిమా ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే..
కోర్ట్ సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. విజయ్ బుల్గానియన్ సంగీత దర్శకత్వం వహించగా.. రామ్ జగదీష్ కోర్ట్ మూవీని డైరెక్ట్ చేశారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేనేని ఈ సినిమాను నిర్మించగా.. నాని సమర్పకుడిగా వ్యవహరించారు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రూ.10 కోట్ల బడ్జెట్‌తో కోర్ట్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఆంధ్రా , నైజాం, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో ఈ సినిమాకు రూ.10 కోట్ల మేర బిజినెస్ చేసింది. కోర్ట్ లాభాల్లోకి రావాలంటే రూ.11 కోట్ల షేర్.. రూ.22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలని బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా విలువ కట్టారు ట్రేడ్ పండితులు.
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో కోర్ట్ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తొలి రోజు ఏకంగా రూ.5 కోట్ల ఓపెనింగ్స్‌తో సంచలనం సృష్టించాడు ప్రియదర్శి. ఇది ఆయన కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్. ఈ మధ్యకాలంలో టైర్ 2 హీరోలకు కూడా ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. శని, ఆదివారల్లో ఈ సినిమా కలెక్షన్స్ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఛావా, డిప్లొమాట్, దిల్‌రూబా వంటి సినిమాలు థియేటర్‌లలో ఉన్నప్పటికీ కోర్ట్ దుమ్మురేపుతుండటం విశేషం.
సినిమా రిలీజై 24 గంటలు గడవకముందే కోర్ట్‌ను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూస్తామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఓటీటీ నిబంధనల ప్రకారం థియేటర్‌లలో విడుదలైన 5 వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీ ముందుకు రావాల్సి ఉంది. దీని ప్రకారం ఏప్రిల్ మొదటి వారం లేదా రెండో వారంలో కోర్ట్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే థియేట్రికల్ బిజినెస్‌ను బట్టి ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ముందుగానే రావొచ్చు, ఆలస్యం కావొచ్చు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











