OTTలోకి డైరెక్ట్‌గా సూపర్ హిట్ మూవీకి సీక్వెల్.... ట్రైలర్ అదిరిపోయిందిగా.. స్ట్రీమింగ్ డేట్​ ఇదే!

ఓటీటీలో విలక్షణ నటి ప్రియమణి నటించిన సూపర్ హిట్ సినిమా 'భామాకలాపం'. ఆహా వేదికగా విడుదలైన ఈ చిత్రం మూవీ లవర్స్​ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా భామాకలాపం 2 వచ్చేందుకు రెడీ అయిపోయింది. తాజాగా మేకర్స్ ఈ సీక్వెల్​​ ట్రైలర్​ను విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ ప్రచార చిత్రంలో ప్రియమణి ఇంటెన్స్​ యాక్షన్ మోడ్​ సీన్స్ అదిరిపోయాయి. థ్రిల్లింగ్​ ఎలిమెంట్స్​ తెగ ఆకట్టుకుంటున్నాయి. దాని గురించే ఈ కథనం..


దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత ప్రియమణి నటించిన భామకలాపం సీక్వెల్ వచ్చేందుకు రెడీ అయిపోయింది. స్ట్రీమింగ్ డేట్ దగ్గరపడడంతో ఈ సీక్వెల్ ట్రైలర్​ను విడుదల చేశారు మేకర్స్. మొదటి భాగాన్ని మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా సాగబోతున్నట్లు ట్రైలర్​ చూస్తే అర్థమవుతోంది.

Priyamani Bhamakalapam 2 Trailer Released: This Movie Streaming on AHA OTT From Feb 16th

ట్రైలర్‌ ఎలా ఉందంటే ఈ సీక్వెల్ మొత్తం బంగారు కోడిపుంజు చూట్టు తిరుగుతందని స్పష్టమైంది. మిడిల్ క్లాస్​ ఫ్యామిలీకి చెందిన హౌస్ వైఫ్​ అనుపమ (ప్రియమణి) యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బుతో అనుపమ ఘుమఘుమ అనే హోటల్ పెట్టాలనుకుంటుంది. ఈ విషయాన్ని తన భర్తకు కూడా చెబుతుంది. ఇదే టైమ్​లో ఓ కుకింగ్ ఐడల్ షోలో ఆమె పాల్గొనేందుకు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. పోటీలో గెలిచిన వారికి బంగారు కోడిపుంజు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటిస్తారు. దాన్ని సొంతం చేసుకోవాలని ప్రియమణి అనుకుంటుంది.

అయితే అదే సమయంలో దాన్ని దొంగలించేందుకు ఓ మాఫియా గ్యాంగ్ ప్రణాళిక రచిస్తుంది. ఈ క్రమంలోనే ప్రియమణిని ఓ మర్డర్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తుంది ఆ మాఫియా గ్యాంగ్. ఈ కేసులో నుంచి బయటపడాలంటే తమ కోసం బంగారు కోడిపుంజు దొంగతనం చేయాలని వారు ప్రియమణిని బెదిరిస్తారు. ఇంకా ఈ ప్రచార చిత్రంలో శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్​ను కూడా చూపించారు. మరి ఆ మాఫీయ గ్యాంగ్ వల్ల ప్రియమణికి ఎదురైన పరిణామాలను ఇంటెన్స్​ యాక్షన్ మోడ్​ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్​ను చూపిస్తూ ట్రైలర్​ను బాగా కట్ చేశారు. ప్రస్తుతం ఇది ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంటోంది. మీరు దీన్ని చూసేయండి..

కాగా, ఆహా ఒరిజినల్‌గా రూపొందిన ఈ సూపర్ హిట్ మూవీ సీక్వెల్​ ఫిబ్రవరి 16 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు, సుధీర్ ఈదర అసోసియేషన్ డ్రీమ్ ఫార్మర్స్ కూడా ఈ సినిమాను నిర్మించాయి. చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించారు మరి ఈ భామా కలాపం 2 తొలి భాగం రేంజ్​లో ఆడియెన్స్​ను అలరిస్తుందో లేదో చూడాలి..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X