OTTలోకి డైరెక్ట్‌గా వచ్చేసిన క్రైమ్ హీస్ట్ థ్రిల్లర్... ఎందులో చూడాలంటే?

ఓటీటీలోకి మోస్ట్ డేంజరస్ హౌస్ వైఫ్ వచ్చేసింది. అదేనండి ప్రియమణి నటించిన భామకలాపం 2 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. భామకలాపం సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా భామ కలాపం 2 తెరకెక్కింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అసలు ఈ సినిమా కథేంటి.. ప్రియమణి ఈసారి ఏం చేసింది.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

అందాల భామ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా 'భామాకలాపం'. ఈ సినిమా 2022లో విడుదల అయి బ్లాక్‌ బస్టర్ హిట్టుగా నిలిచింది. డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రియమణి యాక్టింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు రెండేళ్ల తర్వాత సీక్వెల్‌ గా 'భామాకలాపం 2' తెరకెక్కింది. క్రైమ్ హీస్ట్ థ్రిల్లర్‌ గా భామాకలాపం 2 మూవీ రూపొందింది.

Priyamani Crime Heist Thriller Bhama Kalapam 2 Movie Streaming Now on Aha OTT Full Details Here

మొదటి నుంచే మంచి బజ్: భామ కలాపం 2 చిత్రంలో ప్రియమణి, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు. హీరోయిన్ సీరత్ కపూర్ కీలక పాత్రలో నటించింది. ప్రియమణి, శరణ్య కలిసి ఓ దొంగతనం చేసేందుకు ప్రయత్నించడం చుట్టూ ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.

Priyamani Crime Heist Thriller Bhama Kalapam 2 Movie Streaming Now on Aha OTT Full Details Here

ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్: మొదట్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు తీసుకువచ్చారు. మొదటి పార్ట్ ఆహా ఓటీటీలోనే రిలీజ్ చేయగా.. రెండు పార్ట్ భామ కలాపం 2 సినిమా ఆహా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కు వచ్చేసింది. భామాకలాపం 2 సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ ఫామ్‍ లో ఫిబ్రవరి 16వ తేదీన స్ట్రీమింగ్‍ కు వచ్చేసింది.

Priyamani Crime Heist Thriller Bhama Kalapam 2 Movie Streaming Now on Aha OTT Full Details Here

మొదటి పార్టుకే పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూతోనే: భామాకలాపం 2 చిత్రానికి మొదటి పార్ట్ ను డైరెక్ట్ చేసిన అభిమన్యునే దర్శకత్వం వహించారు. బాపినీడు బీ, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. మొదటి పార్ట్ కు జస్టిన్ ప్రభాకరన్, మార్క్ కె రాబిన్ సంగీతం అందించగా.. భామ కలాపం 2కి ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం అందించారు. ఈ చిత్రానికి దీపక్ యెరగీర సినిమాటోగ్రఫర్ గా పని చేశారు.

Priyamani Crime Heist Thriller Bhama Kalapam 2 Movie Streaming Now on Aha OTT Full Details Here

క్రైమ్ హీస్ట్ థ్రిల్లర్‌గా భామ కలాపం 2: ఇక భామ కలాపం 2 కథ విషయానికి వస్తే... మొదటి భాగం ఆగిన చోట నుంచే రెండో భాగం కథ ప్రారంభం అవుతుంది. ఇక మొదటి భాగం ఒకే అపార్ట్‌మెంటులో జరిగే మర్డర్ మిస్టరీ కాగా... రెండో భాగం హెయిస్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈసారి స్కేల్ కూడా కొంచెం పెంచారని తెలుస్తోంది. ఈ వీకెండ్ మీరు ఇంట్లోనే మంచి క్రైమ్ హీస్ట్ థ్రిల్లర్‌ చూడాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X