OTT : కోట్లు కొల్లగొడుతున్న ప్రియమణి మూవీ... ఓటిటిలోకీ ఎప్పుడొస్తుందంటే?
థియేటర్లలో ప్రస్తుతం అన్ని రేంజ్ ల సినిమాలు సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితం అవుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఓటిటి చిత్రాలకు యమా డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు నుంచి విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం, నందమూరి నరసింహ బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ డాకు మహారాజ్ వంటి చిత్రాలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో దుమ్ము లేపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓటిటి ఆడియన్స్ ను అలరించేందుకు మరిన్ని చిత్రాలు సిద్ధమవుతున్నాయి. థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ కంప్లీట్ చేసుకున్న చిత్రాలు ఇక ఓటిటీ బాట పట్ట ఉన్నాయి. ఇంకా థియేటర్లలో రన్ అవుతున్న అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ ఫిలిం తండేల్ కూడా ఓటిపి డేట్ ని ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 14 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ క్రమంలోనే మరిన్ని చిత్రాలు కూడా ott లోకీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా మలయాళం చిత్రాలకు ఓటిటి లో ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓటిటిలోనే కాదు తెలుగు డబుడ్ వెర్షన్ లో గ్రాండ్ గా థియేర్ల లో విడుదలయి ఇక్కడ కూడా సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మలయాళం లో దుమ్ము లేపిన మార్కో చిత్రం ఓటీటీ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే వరుసలో మరో మలయాళ చిత్రం ఓటిటి లోకి ఎంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా అదనగొట్టిన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ప్రియమణి నటించిన చిత్రమే కావడం విశేషం. తెలుగు ఆడియన్స్ కి ఎంతో సుపరిచితురాలు అయినా ప్రియమణి తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం మలయాళ చిత్రంతో థియేటర్లలో దుమ్ము లేపుతూ... బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్నది.
బాలీవుడ్ లో సందీప్ రెడ్డిపై వివక్ష.? కబీర్ సింగ్ తో అలా... యానిమల్ తో ఇలా!

మలయాళం స్టార్ కుంచాకో బోబన్ - ప్రియమణి కలిసి నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'. ఫిబ్రవరి 20న థియేటర్లలోకి వచ్చింది. 12 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే 25 కోట్ల రూపాయలు బాక్సాఫిస్ కలెక్షన్ రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఇంకా మలయాళం థియేటర్లలో సక్సెస్ఫుల్ రన్ అవుతుంది. భాషతో తేడా లేకుండా మలయాళం చిత్రాలను కూడా ఆదరించే తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం కూడా థ్రిల్ చేయనుంది. కాగా త్వరలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అలరించేందుకు రెడీ అవుతోంది.
కాగా, సక్సెస్ఫుల్ థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ క్రైమ్ త్రిల్లర్ మూవీ OTT ప్లాట్‌ఫారమ్‌పైకి రానుంది. ఇప్పటికే ఈ ఫిల్మ్ డిజిటల్ స్ట్రీమింగ్ డీల్‌ని కూడా పూర్తి చేసుకుని డేట్ ని కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. వచ్చేనెల మార్చి 20 నుంచి ప్రేక్షకులకు ఈ చిత్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఓటిటి డేట్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ అదే డేట్ ను కన్ఫాం చేసినట్టు స్ట్రాంగ్ బస్ వినిపిస్తోంది.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ... చిత్రం ఫేక్ జ్యువెలరీ రాకెట్ ను అడ్డుకునే విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. ప్రధాన పాత్రలో కుంచాకో బోబన్ అద్భుత మైన నట ప్రదర్శనను కనబరిచారు. ఫిమేల్ లీడ్ లో అదరగొట్టింది. జిత్తు ఆశ్రఫ్ డైరెక్షన్ కు ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇక ప్రియమణి విషయానికొస్తే... హీరోయిన్ గతంలో పెళ్లయిన కొత్తలో, యమదొంగ, నవవసంతం, గోలీమార్ వంటి చిత్రాలతో ఎంతగా అలరించిందో తెలిసిందే. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో.. ది ఫ్యామిలీ మెన్, భామ కళాపం వంటి తదితర టీవీ సిరీస్ లతో కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ తమిళంలో సూపర్ స్టార్, దళపతి విజయ్ - వినోత్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం ' జన నాయగన్' లోను కీలక పాత్ర పోషిస్తుంది.


Click it and Unblock the Notifications











