Citadel Review: అదిరిపోయే యాక్షన్, రొమాన్స్‌తో ప్రియాంక చోప్రా.. 'సిటాడెల్' రివ్యూ

రేటింగ్: 3/5

టైటిల్: సిటాడెల్
నటీనటులు: ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్, స్టాన్లీ టుసీ, లెస్లే మ్యాన్ విల్లే, ఆష్లై కమ్మింగ్స్, రొలాండ్ మోలర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: న్యూటన్ థామస్ సిగెల్, మైకెల్ వుడ్
సంగీతం: అలెక్స్ బెల్చర్
క్రియేటర్స్: జోష్ అపెల్బమ్, బ్రేయాన్ ఓహ్, డేవిడ్ వీల్
నిర్మాతలు: జో రూసో, ఆంథోనీ రూసో, మైక్ లారెకో
దర్శకత్వం: న్యూటన్ థామస్ సిగెల్, జెస్సికా యు
విడుదల తేది: ఏప్రిల్ 28-మే 26, 2023 (వారానికి ఒక్కో ఎపిసోడ్)
ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఎపిసోడ్స్: 6, నిడివి: 40 నిమిషాలకుపైగా

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. అటు వెండితెర, ఇటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లలో సినిమాలు సిరీసులు చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ (Citadel). ఇందులో ఆమెతోపాటు హాలీవుడ్ నటుడు రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్ర పోషించాడు. ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ వేదికగా రెండు ఎపిసోడ్స్ విడుదల చేశారు. తర్వాత వారానికి ఒక్కటి చొప్పున మే 26 వరకు మొత్తం 6 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. యాక్షన్, సస్పెన్స్ స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో (Citadel Web Series Review) చూద్దాం.

Priyanka Chopra Citadel Web Series All Episodes Review And Rating In Telugu

కథ: నదియా సింగ్ (ప్రియాంక చోప్రా), మేసన్ కేన్ (రిచర్డ్ మ్యాడెన్) ఇద్దరు ప్రముఖ స్పై ఏజెన్సీ సిటాడెల్ టాప్ ఏజెంట్స్. వృత్తిలో భాగంగా ఓ సీక్రెట్ మిషన్ లో పాల్గొంటారు నదియా, మేసన్. కానీ అది సిటాడెల్ ఏజెంట్లను చంపేందుకు మాంటికోర్ అనే సంస్థ వేసిన ట్రాప్ గా గుర్తిస్తారు. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మేసన్ కేన్ గతం మర్చిపోతాడు. అప్పటికే అంతమైపోయిన సిటాడెల్ సంస్థ మేసన్ కేన్ చనిపోయాడనుకుంటుంది.

Priyanka Chopra Citadel Web Series All Episodes Review And Rating In Telugu

ట్విస్టులు: సుమారు ఎనిమిదేళ్లకు సీఐఏకు దొరికిన న్యూక్లియర్ కోడ్స్ ఉన్న బ్లాక్ బాక్స్ ను చేజిక్కుంచుకునేందుకు మాంటీకోర్ సంస్థ ప్రయత్నించగా దాన్ని మేసన్ కేన్ అడ్డుకుంటాడు. అసలు గతం మర్చిపోయిన మేసన్ అక్కడికి ఎలా వచ్చాడు? అతను బతికే ఉన్నాడని తెలుసుకున్న మాంటికోర్ గ్యాంగ్ ఏం చేసింది? ప్రమాదంలో గాయపడిన నాదియా సింగ్ ఏమైపోయింది? నాదియా సింగ్, మేసన్ కేన్ ఎలాంటి మిషన్ చేపట్టారు? మేసన్ కేన్ కు గతం గుర్తుకు వచ్చిందా? వంటి ఆసక్తికర యాక్షన్ సస్పెన్స్ అంశాలు తెలుసుకోవాలంటే సిటాడెల్ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

Priyanka Chopra Citadel Web Series All Episodes Review And Rating In Telugu

విశ్లేషణ: ఎఫ్‌బీఐ, ఎంఐ6 తరహాలోనే సిటాడెల్ అనేది ఒక స్పై ఏజెన్సీ. వీరిలో మేసన్ కేన్, నాదియా సింగ్ అత్యంత ప్రతిభావంతులైన స్పైలు. స్టోరీ మొత్తం ఈ ఇద్దరి పాత్రల చుట్టూనే ఉంటుంది. అయితే సాధారణంగా స్పై సినిమాల్లో దేశ భద్రత కోసం ఏజెంట్స్ పనిచేయడం, విలన్స్ చేసే చర్యలను తిప్పికొట్టడం, సొంత ఏజెన్సీలో డబుల్ ఏజెంట్స్ (పనిచేస్తున్న సంస్థ సీక్రెట్స్ మరోక సంస్థకు చెప్పడం) ఉండటం వంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్స్ అండ్ అడ్వెంచర్ సన్నివేశాలతో నిండి ఉంటాయి. ఈ సిటాడెల్ కూడా అలాగే ఆసక్తికరంగా సాగుతుంది.

Priyanka Chopra Citadel Web Series All Episodes Review And Rating In Telugu

అదే స్పెషాలిటీ: అయితే సిటాడెల్ టాప్ ఏజెంట్స్ అయిన నాదియా, మేసన్ లోనే ఒక డబుల్ ఏజెంట్ ఉండటం, అది ఎవరనే విషయాన్ని వెబ్ సిరీస్ ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్ గా ప్రజెంట్ చేశారు. ఒక్కో ఎపిసోడ్ లో ఒకరిపై అనుమానం వచ్చేలా ఎపిసోడ్స్ డిజైన్ చేసి ఆకట్టుకున్నారు. ప్రధాన పాత్రల్లోనే రెండు వేరియెషన్స్ చూపిస్తూ సస్పెన్స్ చాలా మెయింటేన్ చేశారు. అదే ఈ సిరీస్ స్పెషాలిటీ. ఫస్ట్ ఎపిసోడ్ ప్రారంభం నుంచి కథలోకి ఇన్వాల్వ్ చేసేలా స్క్రీన్ ప్లే రేసీగా ఉంది. 40 నిమిషాల నిడివి గల 6 ఎపిసోడ్స్ పెద్దగా బోర్ కొట్టవు.

Priyanka Chopra Citadel Web Series All Episodes Review And Rating In Telugu

అలాంటి క్లైమాక్స్: యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ కెమిస్ట్రీ, రొమాన్స్ ఆకట్టుకుంటుంది. ఎమోషన్స్ సీన్స్ కు కనెక్ట్ అవ్వొచ్చు. ట్విస్టులు చాలా బాగున్నాయి. అన్ని ఎపిసోడ్స్ ఇద్దరిపై డౌట్ క్రియేట్ చేసి లాస్ట్ ఎపిసోడ్ క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ మాత్రం అస్సలు ఊహించలేం. 2011లో వచ్చిన లియామ్ నీసన్ Unknown సినిమా క్లైమాక్స్ తరహాలోనే ఈ ట్విస్ట్ ఉంటుంది. అది చూసిన వాళ్లు గెస్ చేయగలరు.

Priyanka Chopra Citadel Web Series All Episodes Review And Rating In Telugu

ఎవరెలా చేశారంటే?: ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ ఇద్దరు తమ నటనతో అదరగొట్టారు. ఇద్దరు రెండు వేరియేషన్స్ చూపిస్తూ ఎమోషన్, రొమాన్స్, యాక్షన్ సన్నివేశాల్లో చెలరేగిపోయారు. మిగతా క్యారెక్టర్స్ అంతా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఎపిసోడ్ స్టార్టింగ్, ఎండింగ్ సైడ్ యాంగిల్, లోవర్, టాప్ యాంగిల్ లో తీయడం బాగున్నా ప్రతీసారి అలాగే చూపించేసరికి కాస్తా విసుగ్గా అనిపిస్తుంది. బీజీఎమ్ సెట్ అయింది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

Priyanka Chopra Citadel Web Series All Episodes Review And Rating In Telugu

ఫైనల్ గా చెప్పాలంటే?: యాక్షన్ ప్రియులకు నచ్చే సిరీస్ సిటాడెల్. అంతేకాకుండా సిటాడెల్ తర్వాతి చాప్టర్ 'సిటాడెల్: డయానా' (Citadel: Diana) 2024లో వస్తుందని హింట్ కూడా ఇచ్చేశారు. త్వరలో ఇదే సిరీస్ ఇండియన్ వెర్షన్ ను సమంత, వరుణ్ ధావన్ చేయనున్నారు. అదేలా ఉంటుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X