Thank you సినిమాతో మరో నష్టాన్ని ఎదుర్కొంటున్న దిల్ రాజు.. ఓటీటీ డీల్ లో మార్పులు?
నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా ఈనెల
22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందు కాస్త మంచి హైప్ క్రియేట్ చేసినప్పటికీ కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఓపెనింగ్స్ అందుకుంది. ఈ స్థాయిలో సినిమా నష్టాలు బారిన పడుతుందని ఎవరు ఊహించలేదు అనే చెప్పాలి. అయితే కనీసం ఓటీటీలో అడ్వాన్స్ గా రిలీజ్ చేసి కొంత డబ్బును రికవరీ చేసుకోవాలని దిల్ రాజు అనుకుంటున్నాడు. రీసెంట్ గా దిల్ రాజు థాంక్యూ మూవీ అడ్వాన్స్ రిలీజ్ కోసం మరొక ప్లాన్ వేసినట్లు సమాచారం.

ఓటీటీ సంస్థల్లో మార్పులు
మొన్నటి వరకు కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయినప్పటికీ ఆ తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో మాత్రం బాగానే క్రేజ్ అందుకున్నాయి. ఒకవేళ అక్కడ కూడా క్రేజ్ రాకపోయినప్పటికీ కూడా ముందుగానే చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమాలకు నిర్మాతలు కాస్త నష్టాల నుంచి తప్పించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఓటీటీ సంస్థలు కూడా ప్లాన్ మార్చేసాయి. సినిమాలో కంటెంట్ కాస్త బలంగా ఉంటేనే పూర్తి డీల్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి.

మొదటి రోజే..
రీసెంట్ గా థాంక్యూ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్స్ వచ్చినప్పటికీ నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా నిర్మాత సేఫ్ అయినట్లుగా ఒక టాక్ అయితే వచ్చింది. థాంక్యూ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజే అతి తక్కువ కలెక్షన్స్ అందుకుంది. దీంతో సినిమా భారీ స్థాయిలో నష్టపోవడం పక్కా అని అందరిలో ఒక క్లారిటీ వచ్చేసింది.

నష్టాల నుంచి తప్పించుకోవాలని..
గతంలో నాగచైతన్య ఫ్లాప్ అయిన సినిమాలు కూడా మొదటి రోజు రెండు కోట్లకు పైగా షేర్ అందుకున్నాయి. కానీ థాంక్యూ సినిమా అంతకంటే తక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడంతో ఈ సినిమా దాదాపు 15 కోట్లకు పైగా నష్టాలను కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక మరోవైపు నాన్ థియేట్రికల్ గా అయినా దిల్ రాజు నష్టాల నుంచి తప్పించుకోవాలని అడ్వాన్స్ గా ఓటీటీ లో విడుదల చేయాలని అనుకున్నారు.

అడ్వాన్స్ రిలీజ్ ప్లాన్
ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయినా వెంటనే కొన్ని ఓటీటీ సంస్థలు అడ్వాన్స్ గా రిలీజ్ చేసుకోవడానికి ఆఫర్స్ కూడా ఇస్తున్నాయి. థియేటర్లో ఒక వారం ఆడిన సినిమాలు కూడా వెంటనే ఓటీటీ లో విడుదలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ విధంగా రిలీజ్ అయితే మాత్రం ఓటీటీ సంస్థలు మంచి అమౌంట్ కూడా ఇస్తున్నాయి. అదే తరహాలో దిల్ రాజు కూడా అమెజాన్ ప్రైమ్ కు అడ్వాన్స్ గా రిలీజ్ చేసి కొన్ని నష్టాల నుంచి తప్పించుకోవాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ బెడిసి కొట్టింది.

మరో సంస్థతో డీల్
కానీ అమెజాన్ ప్రైమ్ అడ్వాన్స్ రిలీజ్ చేయడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో కూడా దిల్ రాజు మరొక సంస్థను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇదివరకే సన్ NXT తో దిల్ రాజు విషయం అడ్వాన్స్ రిలీజ్ గురించి మాట్లాడినట్లు సమాచారం. ఇక ఆ సంస్థ ఈ డీల్ కోసం ఒక అమౌంట్ చెప్పినట్లుగా తెలుస్తోంది. కానీ ఆ డీల్ విషయంలో కూడా దిల్ రాజు పెద్దగా సంతృప్తిగా లేరని సమాచారం. మరి థాంక్యూ సినిమా ఈ రూట్లో ఎంతవరకు ప్రాఫిట్ అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











