Bimbisara OTT Release పై దిల్ రాజు క్లారిటీ.. ఎప్పుడు వస్తుందంటే?
కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ కెరీర్ మొత్తంలోనే అత్యధిక స్థాయిలో మొదటి మూడు రోజుల్లో సాలీడ్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్టిన పెట్టుబడులకు బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. కొత్త దర్శకుడు వశిష్ట తెరపైకి తీసుకువచ్చిన బింబిసార సినిమా రివ్యూలు కూడా పాజిటివ్ గా రావడంతో కలెక్షన్స్ రోజురోజుకు మరింత పెరుగుతూ వచ్చాయి.
గత కొంతకాలంగా వరుసగా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. జనాలు థియేటర్ల వరకు రావడం లేదు అని కూడా అనేక రకాల కామెంట్స్ అయితే వచ్చాయి. అయితే ఈ క్రమంలో మంచి కంటెంట్ తో వస్తే మాత్రం తప్పకుండా జనాలు థియేటర్లోకి వస్తారు అని నిరూపించారు. ఇక మొత్తానికి బింబిసారా సినిమా జనాలను తండోపతండాలుగా థియేటర్లకు రప్పిస్తోంది. ఆదివారం కలెక్షన్స్ కూడా మరొక రేంజ్ లో ఉండడంతో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా ఈ సక్సెస్ ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు సినిమాకు సంబంధించిన ఓటీటీ విడుదలపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బింబిసార సినిమాను దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే సినిమా మరో రెండు మూడు వారాల్లో ఓటీటీ లో వస్తుంది అని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని ఈ సినిమా 50 రోజుల తర్వాతనే ఓటీటీలో విడుదలవుతుంది అని అన్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వార్తలు అబద్ధమని క్లారిటీ వచ్చేసింది. ఇక ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ 5 ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. నాన్ థియేట్రికల్ గా కూడా నిర్మాతకు ఈ సినిమా మంచి ప్రాఫిట్స్ అందుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











