OTT: దిల్ రాజు యూటర్న్.. ఓటిటిల విషయంలో ఇంత మార్పా?

ఇప్పుడు ఉన్న రోజుల్లో ఓటిటి రంగం అనేది సినిమాలని ఇంతలా ప్రభావితం చేస్తుంది అని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. మారుతున్న కాలంతో ప్రతీ దానికి ఒక ఆల్టర్నెట్ ఉంటుంది అన్నట్టుగా సినిమాలకి ఎంటర్టైన్మెంట్ రంగంలో టెలివిజన్, సినిమాకి ధీటుగా ఓటిటి రంగం తక్కువ కాలంలోనే వృద్ధి చెందుతూ వచ్చేసింది. కాగా ఇలా వరల్డ్ వైడ్ గా ఎన్నో స్ట్రీమింగ్ యాప్స్ వరల్డ్ క్లాస్ కంటెంట్ తో కొత్త కొత్త సినిమాలతో అలరించే పనులు పెట్టుకున్నారు.

అయితే గత కోవిడ్ సమయంలో ఈ ఓటిటి వినియోగం మరింత ఎక్కువయ్యింది. దీనితో థియేటర్స్ కి ఓటిటిలు పెద్ద ప్రమాదమే అన్న రీతిలో పరిస్థితులు మారిపోయాయి. కానీ కొన్నాళ్ల తర్వాత సినిమా థియేటర్స్ లో మంచి సినిమాలు పడితే జనాలు వస్తారు అనేది కూడా ప్రూవ్ అయ్యింది. అలాగని ఓటిటి ఎఫెక్ట్ లేదా అంటే? ఖచ్చితంగా ఉంది. కేవలం థియేటర్స్ లో వచ్చిన 30 రోజుల్లోనే సినిమాలు ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి.

producer dil raju comments on ott and audience not coming to theaters

దీనితో థియేటర్స్ లో చాలా మంది ఆడియెన్స్ రావడమే తగ్గించేశారు. కొన్ని సినిమాలు మిడ్ రేంజ్ లో అయితే థియేటర్స్ లో వచ్చి హిట్ అయ్యినవి ఓటిటిలో చూసి చాలా మంది అర్రే.. ఈ సినిమా థియేటర్స్ లో చూడాల్సింది అంటూ కామెంట్స్ చేస్తారు. అయితే దీనిని అలవాటు చేసింది ఎవరో కాదు మన సినిమా వాళ్ళే.. దీనిపై తాజాగా టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారి తీశాయి.

ఇప్పుడు సినిమాలు అన్నీ ఓటిటిలో నెల రోజులకే వచ్చేస్తున్నాయి. దీనితో జనం థియేటర్స్ కి రావడం మానేశారు అని అంటున్నారు. అయితే ఇది చేసింది కూడా తామే అన్నట్టుగా కూడా చెప్పారు. మరి ఇది నిజమే.. ఓటిటి విషయంలో దిల్ రాజు డబుల్ స్టాండర్డ్స్ లో మాట్లాడారు.. తన గత చిత్రం "ఎఫ్ 3" సినిమా సమయంలో టాలీవుడ్ నుంచి ఏ సినిమా కూడా థియేటర్స్ లో వచ్చిన 8 వారాల వరకు ఓటిటిలో రాదనీ తానే చెప్పారు.

కానీ ఆ తర్వాత సీన్ కట్ చేస్తే తన సినిమాలే నాలు వారాల్లో వచ్చేసాయి. అప్పుడు తాను పెట్టిన రూల్ ని తానే బ్రేక్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏమో సినిమాలు నాలుగు వారాలకే వచ్చేస్తున్నాయి జనం రావట్లేదు అంటున్నారు. ఇది ఒకింత విడ్డురంగా ఉందని చెప్పాలి. అలాగే మరో నిర్మాత బన్నీ వాసు కూడా ఓటిటి కోసం మాట్లాడాడు. హిందీలో ఉన్నట్టుగానే మన దగ్గర ఓటిటి విషయంలో కొన్ని రూల్స్ ఉండాలని లేదంటే నెల రోజులకే సినిమాలు వచ్చేస్తున్నాయి అంటూ తెలిపాడు.

మరి ఇలా మన నిర్మాతలు మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని చెప్పినా ఓ సినిమా ప్లాప్ అయితే వారానికి కూడా ఓటిటికి మన ప్రొడ్యూసర్లే ఇచ్చేస్తున్నారు. సో దీని విషయంలో మాత్రం పెద్ద భాద్యత వీరే తీసుకొని ఆడియెన్స్ ని ఫుల్ ఫ్లెడ్జ్ లో రప్పించడానికి ఏదోకటి చెయ్యాలి లేకపోతె పెద్ద సినిమాలు ఏమో కానీ చిన్న సినిమాలు మాత్రం చితికిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

More from Filmibeat

Read more about: dil raju f3 movie bunny vas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X