ది రాజా సాబ్ ఓటిటి కాంట్రవర్సీ.. ప్రభాస్ ఫ్యాన్స్‌పై యంగ్ ప్రొడ్యూసర్ ఫైర్

ప్రెజెంట్ సౌత్ ఇండియా సినిమా దగ్గర మాత్రమే కాకుండా టోటల్ ఇండియన్ సినిమా దగ్గరే మంచి స్టార్డం ఉన్న కొద్ది మంది హీరోస్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. కాగా ఇప్పుడు ప్రభాస్ పేరు మీదే నిర్మాతలు ఓ సినిమా బిజినెస్ కూడా జరిగే పరిస్థితి ఉంది. అయితే మరోపక్క పలు చిత్రాలకి అవి స్టార్ట్ అవ్వాలన్నా స్టార్ట్ అయ్యి రిలీజ్ కావాలన్నా కూడా ఓటిటి రంగం చాలా కీలక పాత్ర పోషిస్తుంది.

మంచి ధరలు రాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పలు సినిమాలు మంచి రేటు వచ్చే వరకు ఆగి మరీ రిలీజ్ కి తీసుకొస్తున్నారు. ఇలా సినిమాల పరంగా ఓటిటి ఇంకా హీరోల క్రేజ్ లు ఆ సినిమా తాలూకా కంటెంట్ ఆధారంగా బిజినెస్ లెక్కలు మారిపోయాయి. కాగా ఇప్పుడు కొందరి అభిమానుల్లో కొన్ని వదంతులు ఉన్నాయి.

producer fires on prabhas fan and explained the raja saab ott controversy

సినిమాకి బడ్జెట్ లెక్కలు ఎక్కువ చెప్పేయడం ఓ స్టార్ హీరో ఉంటే వాటితో ఎక్కువ ఓటిటి ఆఫర్స్ పొంది లాభాలు నిర్మాతలు గడిస్తుంటారు అని అనుకుంటారు. సరిగ్గా సోషల్ మీడియాలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం "ది రాజా సాబ్" విషయంలో కూడా చిన్న కాంట్రవర్సీ నడుస్తుంది. ఈ చిత్రానికి 400 కోట్ల బడ్జెట్ పెడుతున్నామని నిర్మాత విశ్వ ప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

కాగా దీనిపై చిన్న దర్శకుడు మారుతీ లాంటి అతనితో 400 కోట్లు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎక్కువ బడ్జెట్ లు చెప్పేసి ప్రభాస్ పేరు స్టార్డం వాడుకొని ఓటిటిల నుంచి ఎక్కువ ఆఫర్స్ పొందడానికి ఇలా చేస్తుంటారని ఈ సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా సినిమా లైన్ ప్రొడ్యూసర్ నడుమ సోషల్ మీడియాలో కాంట్రవర్సీ నడుస్తుంది.

కాగా దీనిపై దర్శకుడు మారుతీ స్నేహితుడు అలాగే నిర్మాత ఎస్ కె ఎన్ సోషల్ మీడియాలో అసలు ఒక సినిమాకి ఓటిటి ఆఫర్లు ఎలా వస్తాయో రివీల్ చేసాడు. మీరు చెబుతున్నట్టు (ప్రభాస్ ఫ్యాన్) ఓటిటి వాళ్ళు నీ కంటే స్మార్ట్ అని వాళ్ళు ఏదో మేము 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం అని చెబితే ఎక్కడా అందులో సగం 500 కోట్లు ఇచ్చేస్తామని ఈ సినిమాకే కాదు ఏ సినిమాకి కూడా చెప్పరు ఇవ్వరు.

producer fires on prabhas fan and explained the raja saab ott controversy

వాళ్ళు ఆ సినిమా తాలుకా హీరోని బట్టి అందులో కంటెంట్ బట్టి ఇంకా కొన్ని విజువల్స్ ఫుటేజ్ ని ప్రత్యేకంగా చూసిన తర్వాతే సినిమాకి ఇంత రేటు కడతారు అని ఎస్ కె ఎన్ కూల్ రిప్లై అందించాడు. అంతే కాకుండా 1000 కోట్లు అని చెప్పి 500 కోట్లు 100 కోట్లతో తీసాం అని చెప్తే 50 కోట్లు ఇవ్వరు.

అందుకే మీ అభిప్రాయాలని నిజాలు అన్నట్టుగా ఎక్కడా రుద్దకండి అంటూ లాస్ట్ లో చిన్నగా ఫైర్ కూడా అయ్యాడు. సో ఓటిటిల విషయంలో చాలా మందికి ఎస్ కె ఎన్ ఒక క్లారిటీ ఇచ్చినట్టే అని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాని మేకర్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో 10న పాన్ ఇండియా రిలీజ్ కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Read more about: prabhas the raja saab skn
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X