Baby OTT: బేబి ఓటీటీ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. నిర్మాతలు ఊహించని నిర్ణయం
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో రకాల సినిమాలు వచ్చినా.. అందులో అతి తక్కువ చిత్రాలు మాత్రమే సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తూ కల్ట్ బ్లాక్‌బస్టర్లుగా నిలుస్తుంటాయి. అలాంటి వాటిలో ఇటీవలే విడుదలైన 'బేబి' ఒకటి. ఆనంద్ దేవరకొండ హీరోగా సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ సినిమా కాంటెంపరరీ లవ్ స్టోరీతో రూపొందింది. నేటి తరం ప్రేమ విషయంలో చేస్తున్న తప్పులను ప్రస్తావిస్తూ తీసిన ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. దీంతో జూలై 14వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు చేసిన 'బేబి' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలో అయితే దక్కుతోంది. దీంతో ఈ చిత్రానికి వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఇలా ఇప్పటి వరకూ ఈ మూవీ రూ. 37 కోట్లకు పైగా షేర్ రాబట్టడంతో పాటు రూ. 29 కోట్లు వరకూ లాభాలు అందుకుని ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో 'బేబి' మూవీ ఓటీటీ రిలీజ్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

విభిన్నమైన ప్రేమకథతో రూపొందిన 'బేబి' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం ఆహా సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే.. అంటే ఆగస్టు 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.
'బేబి' సినిమా నిర్మాత ఎస్‌కేఎన్ స్పందిస్తూ.. 'బేబి మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది. కాబట్టి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి మేము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది ఆగస్టు 18న స్ట్రీమింగ్ అవుతుంది అన్న వార్తల్లో నిజం లేదు' అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. 'బేబి' మూవీలో విరాజ్ అశ్విన్, నాగబాబు, వైవా హర్ష, లిరిష, కుసుమ, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత కీలక పాత్రలను చేశారు. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











