సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు థియేటర్లలో విడుదల అయిన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. పెద్ద పెద్ద హీరోల చిత్రాలు అయినా సరే హిట్టు కాకపోతే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. సినిమా బాగుందనే టాక్ రావడమో, తమ అభిమాన హీరో చిత్రం కావడమో అయితే తప్ప చాలా మంది థియేటర్లకు వెళ్లట్లేదు. అయితే నెల రోజుల క్రితమే విడుదల అయిన ఓ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలోకి వచ్చేసింది. చడీ చప్పుడు లేకుండా వచ్చేసిన ఈ చిత్రాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ సినిమా ఏంటి, దాన్ని ఎక్కడ చూడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
విక్రాంత్ రెడ్డి, మెహ్రీన్ పిర్జాదాలు హీరోహీరోయిన్లుగా వచ్చిన తాజా చిత్రమే స్పార్క్.. లైఫ్ అనేది ట్యాగ్ లైన్, అయితే ఈ చిత్రం నవంబర్ 17వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. హీరోగా చేసిన విక్రాంత్ రెడ్డియే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే రచయితగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. విడుదలకు ముందు నుంచే ఈ సినిమా ఫుల్ హైప్ ను క్రియేట్ చేసుకుంది. సినిమా ప్రమోషన్స్ చేయడంతో పాటు అందరినీ ఆకట్టుకునేలా టైటిల్ ఉండడంతో భారీ బజ్ క్రియేట్ అయింది.

మెహ్రీన్ తో పాటు రుక్సర్ ధిల్లాన్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. అలాగే సుహాసిని, నాజర్, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యాంగార్, అన్నపూర్ణమ్మ, చమ్మక్ చంద్ర, రాజా రవీంద్రలు ప్రముఖ పాత్రల్లో నటించి మెప్పించారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. అలాగే కోలీవుడ్ నటుడు గురు సోమసుందరం ఈ చిత్రంలో విలన్ గా కనిపించారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం బాగానే ఉందంటూ చాలా మంది రీవ్యూలు కూడా ఇచ్చారు. కానీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదంటూ మరికొంత మంది చెప్పుకొచ్చారు.

ఏది ఏమైనా థియేటర్లలో విడుదలైన ఆ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయంది. కలెక్షన్లలను కూడా ఎక్కువగా రాబట్టుకోలేకపోయింది. కానీ ఓ మోస్తరుగా బాగానే ఉందని అనిపించుకున్న ఈ సినిమా నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం స్పార్క్ లైఫ్ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా స్ట్రీమంగ్ అవుతోంది. మీరు ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని చూసి ఉండకపోతే.. ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీతో కలిసి చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











