OTTలోకి వచ్చేసిన రీసెంట్ సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్.. ఈ హిట్ సినిమాను ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో అనేక అద్భుతమైన సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. ముఖ్యంగా అందరూ మెచ్చే థ్రిల్లర్ సినిమాలను ఎక్కువగా తీసుకు వస్తున్నారు. అవే ఈ మధ్య కాలంలో హిట్లుగా నిలుస్తున్నాయి. హిట్లుగా మాత్రమే కాదు.. అద్భుతమైన సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే తాజాగా మరో అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మలయాళ భాషలో వచ్చిన అద్భుతమైన సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం అబ్రహం ఓజ్లర్. ఈ సినిమాకు మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సూపర్ స్టోరీని రమణధీర్ కృృష్ణన్ రచించారు. ఈ సినిమాలో జయరాం హీరోగా నటించగా... మమ్ముట్టి సీరియల్ కిల్లర్ పాత్రలో నటించారు. అలాగే అనశ్వర రాజన్, అర్జున్ అశోకన్, సెంథిల్ కృష్ణ, ఆర్య సలీం, అనూప్ మీనన్, జగదీష్, దిలీష్ పోతన్ లు ప్రధాన పాత్రలు పోషించారు.

గతేడాది డిసెంబర్ 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నప్పటికీ.. వాయిదా పడింది. చివరకు జనవరి 11వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. ఎలాంటి అంచనాలు లేకపోయినా బాక్సాఫీసు వద్ద రూ. 36.65 కోట్లకు పైగా వసూళ్లును సాధించిందీ చిత్రం. ముఖ్యంగా ఈ సినిమాలో అబ్రహం ఓజ్లర్ (జయరాం) కుటుంబ సభ్యులు అంతా మిస్ అవుతారు. ఆ తర్వాత వరుసగా పలు హత్యలు జరుగుతాయి. ఒకరితో ఒకరికి సంబంధం లేని హత్యలు జరగడం.. అక్కడే హ్యాపీ బర్త్ డే అంటూ ఉత్తరాలు రాసి పెట్టడం జరుగుంది.
వీటన్నిటినీ చూసిన అబ్రహం ఓజ్లర్ ఈ కేసులు అన్నింటినీ చేధించి తన కుటుంబాన్ని కలుసుకోవడం... వారిని ఎవరు, ఎలా కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు.. ఆ తర్వాత ఏం చేశారో తెలుసుకుంటారు. ఇదే ఈ సినిమా కథ. అయితే తాజాగా ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. చడీచప్పుడు లేకుండా ఈ చిత్రం ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వేధికగా ఈ సూపర్ హిట్ సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఈ సినిమాను చూసి ఉండకపోతే ఇప్పుడే వెళ్లి చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఇంట్లోనే కూర్చుని ఈ అద్భుతమైన చిత్రాన్ని ఆస్వాదించండి.


Click it and Unblock the Notifications











