Pushpa 2 on OTT: బ్రేకింగ్: పుష్ప 2 ఓటీటీ డేట్ వచ్చేసింది.. కొత్త ట్విస్ట్‌తో ఏ రోజు నుంచి అంటే?
కొన్నాళ్ల కితం వరకు పాన్ ఇండియా వైడ్ గా థియేటర్స్ లో ఓ రేంజ్ లో ఎదురు చూసిన భారీ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది పుష్ప 2 అనే చెప్పొచ్చు. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తో చేసిన ఈ సినిమా ఇండియన్ సినిమా దగ్గర బాహుబలి 2, కేజీఎఫ్ 2 ల తర్వాత వాటికి మించిన హైప్ ని బిల్డప్ చేసుకుంది.
ఇలా ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సంచలన చిత్రం భారతీయ సినిమా దగ్గర ఏడేళ్ల పాటుగా ఉన్న బాహుబలి 2 రికార్డులు బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. మెయిన్ గా ఒక్క హిందీ వెర్షన్ లోనే ఈ చిత్రం 1000 కోట్ల మేర గ్రాస్ ని అందుకొని ఒక హిస్టారికల్ రన్ ని ఏకంగా బాలీవుడ్ సినిమాలు కూడా అందుకోని ఫీట్ ని సెట్ చెయ్యగా ఇపుడు ఫైనల్ గా 50 రోజుల రన్ ని కంప్లీట్ చేసేసుకుంది.

అయితే ఇటీవల కాలంలో లాంగ్ రన్ ఆడిన తక్కువ సినిమాల్లో ఇది కూడా నిలిచింది. మరి మొత్తానికి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన ఈ సినిమా ఓటిటి రిలీజ్ కూడా అపుడు థియేటర్స్ రిలీజ్ తర్వాత మంచి సస్పెన్స్ గా మారగా ఇపుడు ఫైనల్ గా అందుకు సమయం సిద్ధం అయ్యింది. ఈ చిత్రాన్ని మేకర్స్ 56 రోజుల తర్వాతే ఓటిటిలో వదులుతామని ముందే ఫిక్స్ అయ్యారు. కాగా ఇపుడు 54 రోజులకి చేరుకుంది.
మరి ఇలా 56 రోజులు కంప్లీట్ అయ్యిన వెంటనే ఈ సినిమా ఓటిటిలో వచ్చేందుకు రెడీ అయ్యిపోయింది. ఈ సినిమాని ప్రపంచ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ పాన్ ఇండియా భాషల్లో కొనేసిన సంగతి తెలిసిందే. కాగా ఇందులో ఈ జనవరి 30 గురువారం నుంచే స్ట్రీమింగ్ కి వచ్చేందుకు లాక్ అయ్యింది. మరి ఇది బిగ్ అప్డేట్ అనుకుంటే దీనికి మించిన ట్విస్ట్ ఇపుడు ఇంకొకటి ఉంది.
కాగా థియేటర్స్ లో పుష్ప 2 సినిమాని ఏకంగా 3 గంటల 20 నిమిషాలకి రిలీజ్ చేస్తారు అంటేనే అంతా షాక్ అయ్యారు. అయినప్పటికీ అది పెద్ద హిట్ అయ్యింది. ఇక ఇది హిట్ అయ్యాక మొన్ననే మరో 20 నిమిషాలు జోడించి 3 గంటల 40 నిమిషాలకి తీసుకొచ్చారు. అయితే ఓటిటిలో 3 20 గంటల నిమిషాలది వస్తుందా లేక 40 నిమిషాలు ఉన్నది వస్తుందా అనేది సస్పెన్స్ గా మారగా ఇపుడు ఈ రెండు కాకుండా మరో 4 నిమిషాలు జోడించి ఏకంగా 3 గంటల 44 నిమిషాల రన్ టైంతో నెట్ ఫ్లిక్స్ వారు ట్విస్ట్ ఇచ్చారు.
ఇది మాత్రం ఆడియెన్స్ కి బిగ్ సర్ప్రైజ్ అని చెప్పాల్సిందే. మరి ఆ అదనపు 4 నిమిషాలు ఏంటి ఏ సీన్స్ అనేది తెలియాలి అంటే ఈ జనవరి 30 వరకు తీరాల్సిందే. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా నటించగా దేవిశ్రీ ప్రసాద్, సామ్ సి ఎస్ లు సంగీతం అందించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











