pushpa 2: పుష్ప-2 ఓటీటీ పై మూవీ మేకర్స్ క్లారిటీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Pushpa 2 OTT Release: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా పుష్ప 2. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఎవరు ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ తన రూలింగ్ ను కొనసాగిస్తున్నాడు. కేవలం 14 రోజులలో 1500 కోట్ల మార్కును క్రాస్ చేసి.. పలు పాన్ ఇండియా సినిమాల రికార్డులను బ్రేక్ చేశాడు. భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది పుష్ప 2. ఈ క్రమంలో 'పుష్ప 2 ఓటీటీపై పలు వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై చిత్ర బృందం (మైత్రీ మూవీ మేకర్స్) ఎక్స్ వేదికగా స్పందించింది. ఇంతకీ ఏమన్నదంటే..?
సన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్ నటించిన చిత్రం పుష్ప 2. మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప ది రైజ్‌కు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురుచూసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 వేలకు పైగా థియేటర్‌లలో రిలీజ్ అయింది. ఈ సినిమా వసూళ్ల పరంగా ఊచకోత కోస్తోంది. ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా సినిమాల రికార్డులను తిరగ రాస్తూ ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డును నెలకొల్పింది పుష్ప 2.

అల్లు అర్జున్ పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ సినిమా రిలీజ్ ముందుగానే మొత్తంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2 డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 250 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్నట్టు టాక్. కానీ, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయలేదు.
ఎవరు ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ తన రూలింగ్ ను కొనసాగిస్తున్నాడు. కేవలం మూడు రోజులలో 500 కోట్ల మార్క్ ను క్రాస్ చేశాడు. ఇక వారం రోజులు తిరిగే లోపే రూ. 1000 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఇక 14 రోజులలో 1500 కోట్ల మార్కును క్రాస్ చేసి.. పలు పాన్ ఇండియా సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. పుష్ప 2: ది రూల్ నార్త్ లోనూ సరికొత్త రికార్డు ను క్రియేట్ చేసింది.
హిందీ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.600 కోట్లు రాబట్టి నయా రికార్డును క్రియేట్ చేసింది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకారం.. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,500 మార్క్‌ను దాటింది. ప్రస్తుతం ఈ చిత్రం రూ.1,508 కోట్లు వసూలు చేసింది.
There are rumours floating around about the OTT release of #Pushpa2TheRule
— Mythri Movie Makers (@MythriOfficial) December 20, 2024
Enjoy the Biggest Film #Pushpa2 only on the Big Screens in this Biggest Holiday Season ❤️
It won't be on any OTT before 56 days!
It's #WildFirePushpa only in Theatres Worldwide 🔥
వసూళ్ల పరంగా ఊచకోత కోస్తోన్న పుష్ప-2 త్వరలో ఓటీటీకి రానున్నదంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.జనవరి రెండో వారం( జనవరి 9) నుంచి పుష్ప- 2 స్ట్రీమింగ్ కాబోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం (మైత్రీ మూవీ మేకర్స్) స్పందించింది. పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ పై క్లారిటీ ఇచ్చింది. 'పుష్ప 2: ది రూల్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై పలు రూమర్స వస్తున్నాయి. రాబోయే అతి పెద్ద హాలీడే సీజన్‌లో ఈ మూవీని సిల్వర్స్క్రీన్పైనే చూసి ఆస్వాదించండి. పుష్ప 2 విడుదలైన నాటి నుంచి 56 రోజుల కన్నా ముందు ఏ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కాదు. ఇది వైల్డ్ ఫైర్ పుష్ప.. వరల్డ్ వైడ్‌గా థియేటర్‌లోనే' అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











