Pushpa 2 OTT Release Date : ఓటీటీలోకి పుష్ప 2 .. ఎప్పుడు.. ఎందులో అంటే?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్ నటించిన చిత్రం పుష్ప 2. గతంలో వచ్చిన పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మధ్యకాలంలో యావత్ దేశం ఎదురుచూసిన చిత్రం పుష్ప 2 అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన పుష్ప ది రూల్.. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో దూసుకెళ్తోంది.

ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా రికార్డుల దుమ్ముదులుపుతోంది. ఇప్పటికే పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ వీకెండ్ లోగా రూ.500 కోట్ల టార్గెట్‌ను కొట్టేయాలని అల్లు అర్జున్ కసిగా ఉన్నాడు. అయితే ఈ భారీ చిత్రం కోసం ఓటీటీ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. భారత్‌లోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉన్న పుష్ప 2కి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిన సంగతి తెలిసిందే.

Pushpa 2 The Rule OTT Expected Netflix release date of Allu Arjun s film

థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని మొత్తంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2 డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 250 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకుందని ఫిలింనగర్ టాక్. అయితే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయలేదు. కానీ నెట్‌ఫ్లిక్స్ మాత్రం ఈ విషయాన్ని తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో ప్రకటించింది.

పుష్ప మొదటి భాగానికి సంబంధించి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ హక్కులను సంపాదించింది. ఇందుకోసం అప్పట్లోనే రూ. 30 కోట్లు ఖర్చు చేసింది. అయితే పుష్ప 1 సంచలన విజయం, ప్రస్తుతం పుష్ప 2పై దేశవ్యాప్తంగా ఉన్న హైప్ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ హక్కులకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. అమెజాన్‌తో పోటీ పడి మరి పుష్ప 2 ఓటీటీ హక్కులను కళ్లు చెదిరే మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ఫిలింనగర్ టాక్ .

అంతా బాగానే ఉంది కానీ పుష్ప 2 ది రూల్ ఎప్పుడు ఓటీటీలోకి రాబోతోంది అంటూ నెటిజన్లు , అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో డిస్కష్ చేస్తున్నారు. సాధారణంగా థియేటర్‌లోకి వచ్చిన 5 వారాలు లేదా 50 రోజుల తర్వాత ఎక్కువగా పెద్ద సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే పుష్ప 2 క్రేజ్ , మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా రెండు , మూడు నెలలు ఓటీటీలోకి రాకపోవచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని పుష్ప 2 ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై నెట్‌ఫ్లిక్స్ పండగ అనే హ్యాష్ ట్యాగ్ ఉండటంతో చాలా మంది పండక్కి పుష్పగాడి ఓటీటీ ఖాయమని భావిస్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో?

Read more about: pushpa 2 the rule ott netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X