Pushpa 2 OTT Release : పుష్ప 2 ఓటీటీ డేట్ ఫిక్స్ .. ఇంత తొందరగానా, ఎప్పటి నుంచి అంటే?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్ నటించిన చిత్రం పుష్ప 2. మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. బాహుబలి 2, కేజీఎఫ్ 2 తర్వాత ఈ మధ్యకాలంలో యావత్ దేశం ఇంతలా ఎదురుచూసిన చిత్రం పుష్ప 2 అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో రిలీజైన పుష్ప ది రూల్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా రికార్డుల దుమ్ముదులుపుతోంది. తొలి వారంలోనే దాదాపు రూ. 1000 కోట్ల వసూళ్లను సాధించి భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను సాధించిన సినిమాపు పుష్ప 2 నిలిచింది. అంతేకాదు 2024లో హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన స్త్రీ 2, కల్కి 2898 ఏడీలను అల్లు అర్జున్ క్రాస్ చేశాడు. తద్వారా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా పుష్ప 2 నిలిచింది.

ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్ధలు కొట్టాలని పుష్ప 2 దూసుకెళ్తోంది. లాంగ్ రన్‌లో ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి. అయితే ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఓటీటీ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. భారత్‌లోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉన్న పుష్ప 2కి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిన సంగతి తెలిసిందే.
థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని మొత్తంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2 డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 250 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కానీ, నెట్‌ఫ్లిక్స్ కానీ ఎక్కడా ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయలేదు.

కాగా పుష్ప ది రైజ్‌కి సంబంధించి అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓటీటీ హక్కులను సంపాదించింది. ఇందుకోసం అప్పట్లోనే రూ. 30 కోట్లు ఖర్చు చేసిందని టాక్. పుష్ప 1 బ్లాక్ బస్టర్ నేపథ్యంలో పుష్ప 2 డిజిటల్ హక్కుల కోసం అమెజాన్- నెట్‌ఫ్లిక్స్ మధ్య కళ్లు చెదిరే మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ఫిలింనగర్ టాక్ . అంతా బాగానే ఉంది కానీ పుష్ప 2 ది రూల్ ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ కాబోతోంది అన్నది తెలియక నెటిజన్లు , అల్లు అర్జున్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
సాధారణంగా థియేటర్‌లోకి వచ్చిన 5 వారాలు లేదా 50 రోజుల తర్వాత ఎక్కువగా పెద్ద సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే పుష్ప 2 క్రేజ్ , మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా రెండు , మూడు నెలలు ఓటీటీలోకి రాకపోవచ్చని తొలుత కామెంట్స్ వినిపించాయి. కానీ నెట్‌ఫ్లిక్స్ ఊహించని విధంగా సర్‌ప్రైజ్ చేసింది. జనవరి 9 నుంచి పుష్ప 2 స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











