Pushpa జగదీష్ హీరోగా సినిమా.. నేరుగా ఓటీటీలోకి 'సత్తిగాని రెండెకరాలు'.. ఎప్పుడంటే?
పుష్ప.. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చెసింది అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో క్యాస్టింగ్ నుంచి మూవీ టేకింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్ లు, నటీనటుల పెర్ఫామెన్స్ ఒక్కో డైమండ్ అన్నంత టాక్ తెచ్చుకుంది. అందులో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు జగదీష్ ప్రతాప్. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు ఫ్రెండ్ గా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. అలాంటి నటుడితే మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా రూపొందించింది. ఆ చిత్రం నేరుగా త్వరలో ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది.
'పుష్ప: ది రైజ్' సినిమాతో అల్లు అర్జున్, రష్మిక మందన్నాకు ఎంతటి పేరు వచ్చిందో అందులోని నటీనటులకు కూడా మంచి ఫేమ్ దక్కింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా, పుష్పకి రైట్ హ్యాండ్ పాత్ర అయిన కేశవగా నటించి పాపులర్ అయ్యాడు జగదీష్ ప్రతాప్. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన అతను ఉత్తారంధ్ర యాసలో మాట్లాడుతూ అందరనీ ఆకట్టుకున్నాడు. అల్లు అర్జున్ తర్వాత అంతటి స్థాయిలో హైలెట్ అయ్యాడు. ఏందీ మచ్చా.. 10 రూపాల పూజ అంటూ తను మాట్లాడిన పలాస యాస అందరి మనసులో ముద్రించుకునిపోయింది.

సీరియస్ గానే కుండా జగదీష్ తను ఉన్న సన్నివేశాల్లో ప్రేక్షకులను నవ్వించాడు. జగదీష్ సినిమాల్లోకి రాకముందు షార్ట్ ఫిలీంస్ లలో నటించి ఆకట్టుకున్నాడు. నిరుద్యోగ నటులు, కొత్త పోరడు వంటివి పేరు తీసుకొచ్చాయి. ఇక 2019లో కమెడియన్ ప్రియదర్శి హీరోగా వచ్చి మల్లేషం చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు జగదీష్. అలాగే 2020లో పలాస 1978 సినిమాలో నటనతో ఆకట్టుకున్న జగదీష్ కు 2021లో పుష్ప సినిమాలో అవకాశం లభించింది. ఇప్పుడు పుష్ప 2లో కూడా సందడి చేయనున్నాడు.
ఇదిలా ఉంటే జగదీష్ ప్రతాప్ హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో 'సత్తిగాని రెండెకరాలు' టైటిల్ తో కాన్సెప్టెడ్ చిత్రం రానుంది. అయితే ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాతోనే మైత్రీ మూవీస్ సంస్థ డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతోంది. 'సత్తిగాని రెండెకరాలు' సినిమా నేరుగా ఆహా ఓటీటీ వేదికగా మార్చి 17న విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. ఇందులో వెన్నెల కిశోర్, బిత్తిరి సత్తి, మోహన శ్రీతోపాటు పలువురు నటిస్తున్నారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా నేరుగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమాతో అభినవ్ రెడ్డి దండ కొత్త దర్శడిగా పరిచయం అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











