రాశీఖన్నా బ్లాక్ బాస్టర్ సిరీస్.. ‘ఫర్జీ‘ సీజన్ 2 వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
టాలీవుడ్ లో ఆ మధ్య వరుస చిత్రాలతో యంగ్ హీరోయిన్ రాశీ కన్నా తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా తెలుగుతోపాటు తమిళ చిత్రాలోనూ నటించి మెప్పించింది. ఢిల్లీకి చెందిన రాశీ ఖన్నా నార్త్ బ్యూటీ అయినప్పటికీ సౌత్ఆడియన్స్ ను అలరించడంలో సక్సెస్ సాధించింది. దక్షిణాదిన తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. 2013 నుంచి ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేస్తూనే వస్తుంది. కానీ తెలుగులో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. ఎంతో మంది స్టార్స్ తో నటించిన సాలిడ్ హిట్ దక్కించుకోలేకపోయింది.
అయినప్పటికీ టాలీవుడ్ లో రాశీ ఖన్నాకు గుర్తుండిపోయే కొన్ని సినిమాలు ఉన్నాయి. బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవకుశ, తొలిప్రేమ, వెంకీ మామ, ప్రతిరోజు పండగే వంటి సినిమాలు ఈ ముద్దుగుమ్మకు కమర్షియల్ హిట్ ను మాత్రం అందించాయి. అలాగే తమిళంలో తిరుచిత్రంబలం, సర్దార్, అరణ్మనై4 చిత్రాలు కూడా మంచి సక్సెస్ ని అందించిపెట్టాయి. తెలుగు తమిళ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ థియేటర్లో సందడి చేస్తూ తన అభిమానులను ఆడియన్స్ ను అలరిస్తూనే వస్తుంది. కొన్నాళ్లుగా మాత్రం పూర్తిగా బాలీవుడ్ లోనే బిజీ అయిపోయింది.

బాలీవుడ్ లో రాశీ ఖన్నాకు ఒక బ్లాక్ బస్టర్ సిరీస్ ఉండింది. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటించిన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్ లో రాశీ ఖన్నా మెగా పాత్రలో నటించి మెప్పించింది. రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ 2023లో ఓటీటీ వేదికన సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సిరీస్లో సౌత్ స్టార్ విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో నటించడం అప్పట్లో సంచలనంగా మారింది. అదే మొదటి సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో ఆడియన్స్ రెండవ సిరీస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా దీనిపై రాశీ ఖన్నా అప్డేట్ అందించింది.
ఫర్జీ సీజన్ 2 షూటింగ్ 2025 డిసెంబర్ లో ఉంటుందని తెలియజేసింది. అన్ని కుదిరితే ఇంకా ముందుగానే షూటింగ్ స్టార్ట్ అయి క్రేజీ అప్డేట్స్ కూడా అందుతాయని చెప్పింది. అయితే ఇప్పటి వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ నడిచాయని తెలిపింది. ఇక సీజన్ 2 ఫస్ట్ సీజన్ కన్నా ఎక్కువ ట్విస్టులతో కొనసాగుతుందని తెలిపింది. ఆడియన్స్ ఏమాత్రం ఊహించిన విధంగా సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారని సీక్వెల్ పై తారాస్థాయి అంచనాలను క్రియేట్ చేసింది. ఇక మొదటి సీజన్ తర్వాత రాజ్ అండ్ డీకే దర్శకులు స్టార్ హీరోయిన్ సమంత తో ' సిటాడెల్' సిరీస్ ను షూట్ చేసి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా ప్రస్తుతం ఈ ద్వయం దర్శకులు ' ఫర్జీ సీజన్ 2' పై ఫోకస్ చేయబోతున్నారు.
కౌంటర్ ఫిట్ మనీ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇక షాహిద్ కపూర్ తన స్నేహితుడు ఫిరోజ్తో కలిసి దొంగ నోట్లను ఎలా ముద్రిస్తారు, తద్వారా తమకు పోలీసుల నుంచి వచ్చిన ఛాలెంజ్ ఏంటి? ఎలా తప్పించుకున్నారు అనేది కథ అంశం. ఇక మొదటి పార్ట్ లో గ్యాంగ్ స్టార్ మన్సూర్ కు పెద్ద డీల్ కోసం దొంగ నోట్లు ముద్రిస్తారు. వాటిని మన్సూర్ కు అప్పగిస్తారు. కానీ అతను షాహిద్ కపూర్ తన స్నేహితుడిని మోసం చేస్తాడు. అందుకు షాహిద్ మనసూర్ ను, గో డౌన్ లో నిలువ ఉంచిన దొంగ నోట్లను కాల్చివేస్తారు. తర్వాత ఏం జరిగిందనేది సీక్వెల్లో తెలియాల్సి ఉంది. ఈ సిరీస్ ను రాజ్ అండ్ డీకే D2R బ్యానర్లో స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక 2026 చివర్లో కన్నా సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











