OTT: ఈ పండక్కి మీ ఇంటికి వచ్చేస్తున్న చంద్రముఖి... రెడీగా ఉండండి!
దసరా పండక్కి సినిమాల సందడి మొదలైంది. థియేటర్లలో పెద్ద సినిమాల హాడావిడి... ఓటీటీల్లో చిన్న సినిమాల సందడి ప్రారంభం అయింది. ఇప్పుడు మరో చిత్రం పండగ కానుకగా.. మీ ఇంటికి వచ్చేస్తోంది. థియేటర్లలో భయపెట్టిన చంద్రముఖి 2... ఇప్పుడు ఇంట్లో భయపెట్టేందుకు వచ్చేస్తోంది. రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి 2... అనుకున్న టైం కంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అప్పుడెప్పుడో 2005 లో రిలీజ్ అయిన చంద్రముఖి.. జనాలను ఎంతలా భయపెట్టిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రజనీకాంత్, జ్యోతిక యాక్టింగ్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆ సినిమా అందులో లీనం అయి చూసేలా చేసింది. ఇక అప్పటి వరకు ఉన్న హారర్ మూవీస్ ఓ లెక్క అయితే.. ఈ చిత్రం మరోక ఎత్తు. రజినీ కాంత్ యాక్టింగ్... జ్యోతిక ఫెర్మామెన్స్, నయనతార అందం.. అన్నీ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ మూవీకి పీ వాసు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిచింది.

ఇక దాదాపు 18 ఏళ్ల తర్వాత చంద్రముఖి సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాడు పీ వాసు. ఇక ఈ మూవీలో రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో తెరక్కించారు. ఇక ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండం మరింత ఆసక్తిని కలిగించింది. ఇక ఎన్నో అంఛనాల నడుమ సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలోకి వచ్చింది చంద్రముఖి 2. తెలుగు, కన్నడ, తమిళ,మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో వచ్చింది.

చంద్రముఖి 2 చిత్రం తమిళంలో బాగానే ఆడింది. కానీ తెలుగు ఆడియెన్స్ ను మాత్రం ఆకట్టుకోలేకపోయింది ఈ చిత్రం. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‍లో సుభాస్కరన్ అల్లిరాజా భారీ బడ్జెట్ తో నిర్మించారు. పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ మూవీకి కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేకపోయాయి. చంద్రముఖి పార్ట్ 1 సినిమానే మళ్లీ తీశారనే కామెంట్స్ వినిపించాయి.
ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూశారు ప్రేక్షకులు. అయితే నవంబర్ లో రిలీజ్ కానుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అనుకున్న సమయం కంటే ముందే చంద్రముఖి 2 ఇంటికి వచ్చేస్తోంది. ఈ సినిమాపై భారీ అంఛనాలు నెలకొనడంతో.. భారీగా బిజినెస్ జరిగింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు డిజిటల్ ప్రిమియర్ కోసం కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం అయింది.

చంద్రముఖి 2.. నెట్ ఫ్లిక్స్ వేదికగా అక్టోబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ ఫ్రకటించింది. ఇక ఈ మూవీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ట్విట్టర్ వేదిక వెల్లడించింది. దీనితో చంద్రముఖి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. పండుగ సమయంలో ఇలాంటి చిత్రం వస్తే.. ఇంటిల్లి పాది చూసేయొచ్చని అనుకుంటున్నారు. మీరు గనుక థియేటర్లలో మిస్ అయితే ఈ సినిమాను ఓటీటీలో చూసేయండి.


Click it and Unblock the Notifications











