OTTలోకి రీసెంట్ క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ.. ఎందులో చూడాలంటే?

ఓటీటీలోకి ప్రతి వారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇక నెలరోజులు కూడా కాకముందే మరో మూవీ ఓటీటీలోకి రాబోతుంది. డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ రాఘవలారెన్స్ లారెన్స్, డైరెక్టర్ కమ్ యాక్టర్ సూర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం జిగర్తాండ డబుల్ ఎక్స్. ఈ సినిమా జిగర్తాండ సినిమాకు సీక్వెల్. ఈ సినిమా నవంబర్ 10న థియేటర్లోకి వచ్చి సందడి చేసింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తమిళంలో జిగర్తాండ అనే చిత్రం 2014లో వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది. ఆ సినిమా తెలుగు గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ రీమేక్ చేశాడు. తెలుగులోనూ ఆ సినిమా సక్సెస్ అయింది. ఇక దాదాపు 9 ఏళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించారు. డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ రాఘవలారెన్స్ లారెన్స్, డైరెక్టర్ కమ్ యాక్టర్ సూర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన జిగర్తాండ డబుల్ ఎక్స్ నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Raghava Lawrence SJ Suryah Jigarthanda Double X Movie Going To Streaming on Netflix OTT Dec 8th Full Details Here

జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీకి ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. క్రైమ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను తెలుగు, తమిళ్ తో పాటు.. కన్నడ, మలయాళ, హింధీ భాషల్లో కూడా రిలీజ్ చేశారు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూలు వచ్చినా నిలబడలేకపోయింది.

ఈ సినిమాలో నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో కూడా ముఖ్యమైన కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు దసరాకు మ్యూజిక్ అందించిన సంతోష్ నారాయణన్.. ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాను స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్ కింద తెరకెక్కించారు. అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆడియెన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

Raghava Lawrence SJ Suryah Jigarthanda Double X Movie Going To Streaming on Netflix OTT Dec 8th Full Details Here

ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు విక్రయించినట్లు తెలుస్తోంది.ఈ సినిమా రిలీజ్ అయి నెలరోజులు కాకముందే నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాను మీరు థియేటర్లలో మిస్ అయితే గనుక ఇంట్లోనే కూర్చొని ఎంచాక్క చూసేయండి.

ఇక జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా కథ విషయానికి వస్తే.. కృపాకర్‌ (ఎస్‌జే సూర్య) కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదించుకోగా... అంతలోనే చేయని తప్పుకు ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. కర్నూల్‌లోని జిగర్‌ తాండ మర్డర్‌ క్లబ్‌ గ్యాంగ్‌స్టర్‌ సీజర్‌ ను చంపితే ఉద్యోగం వస్తుందని ఓ ఆఫర్ వస్తుంది. అందుకని సీజర్‌ను చంపే ఆపరేషన్‌ను పూర్తి చేసేందుకు ఒప్పుకుంటాడు సూర్య మరి కృపాకర్‌ అనుకున్నది జరిగిందా లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X