ఓటీటీలోకి 240 కోట్ల సంచలనం.. అజయ్ దేవగణ్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హిట్టూ, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవగణ్. మాస్, యాక్షన్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌లా వెలుగొందుతున్నారు అజయ్. ఆయన నుంచి మూవీ వస్తుందంటే మాస్ జనాలు పూనకంతో ఊగిపోతారు. తాజాగా అజయ్ దేవగణ్ నటించిన మూవీ రైడ్ 2. ఐదేళ్ల క్రితం వచ్చిన రైడ్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ తాజాగా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ వివరాల్లోకి వెళితే..

రాజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రైడ్ 2లో అజయ్ దేవగణ్, రితేష్ దేశ్‌ముఖ్, వాణీ కపూర్‌, రజత్ కపూర్, సౌరభ్ శుక్లా, సుప్రియా పాఠక్‌లు కీలకపాత్రలు పోషించారు. సుధీర్ కే చౌధురి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. అమిత్ త్రివేది స్వరాలు సమకూర్చారు. టీ సిరీస్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్‌లు సంయుక్తంగా నిర్మించారు.

Raid 2 OTT release date When and where to watch Ajay Devgn s crime thriller Movie

రైడ్ 2 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి రైడ్ 2 చిత్రానికి దాదాపు 120 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రైడ్‌కు సీక్వెల్ మూవీ కావడంతో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలు, టీజర్లు, ట్రైలర్లతో రైడ్ 2పై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. దీనికి తగినట్లుగా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రైడ్ 2 కలెక్షన్స్ ఎంత?
ఇక రైడ్ 2 సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా మొదటి రోజు 20 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టగా.. రెండో రోజు 13 కోట్ల రూపాయలు, మూడో రోజు 19 కోట్ల రూపాయలు, 4వ రోజు 22.5 కోట్ల రూపాయలు, 5వ రోజు 7.5 కోట్ల రూపాయలు రాబట్టింది. చూస్తుండగానే 100 కోట్ల క్లబ్‌లో చేరిన అజయ్ దేవగణ్ మూవీ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపరుస్తూ 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది.

అజయ్ కెరీర్‌లో మరో బిగ్ మూవీ
థియేట్రికల్ రన్ ముగిసేనాటికి రైడ్ 2 చిత్రం ఇండియాలో రూ.178.28 కోట్ల నెట్ .. రూ.206.28 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఓవర్సీస్‌లోనూ ప్రభంజనం సృష్టించిన అజయ్ దేవగణ్ మూవీ అక్కడ రూ.31 కోట్లు రాబట్టింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి రైడ్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.237 కోట్ల కలెక్షన్స్ ఆర్జించినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. తద్వారా అజయ్ దేవగణ్ కెరీర్‌లో అత్యథిక వసూళ్లు సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ లిస్ట్‌లో తానాజీ (368 కోట్లు) టాప్ ప్లేస్‌లో నిలిచింది. సింగం ఎగైన్ (248 కోట్లు), దృశ్యం 2 (240 కోట్లు), గోల్‌మాల్ ఎగైన్ (205 కోట్లు) ఉన్నాయి.

రైడ్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు
రైడ్ 2 ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. జూన్ 27 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. థియేటర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X