ఓటీటీలోకి కాంట్రవర్శీ హీరో సినిమా.. ఫుల్లు ట్విస్టులున్న ఈ మూవీని ఎలా చూడాలంటే!
తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది యంగ్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న వాళ్లు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. అంటే టాలెంట్ ఉన్నా హిట్లు సాధించలేకపోతున్న హీరోలు కెరీర్ పరంగా సతమతం అవుతున్నారు. అలాంటి వారిలో రాజ్ తరుణ్ ఒకడు. దీనికితోడు ఈ మధ్య కాలంలో అతడు పలు వివాదాల్లోనూ చిక్కుకుంటున్నాడు.
కాంట్రవర్శీ హీరోగా సెన్సేషన్ అవుతోన్న రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రమే 'పురుషోత్తముడు' (Purushotamudu). రామ్ భీమన దర్శకత్వం వహించిన ఈ చిత్రం పక్కా కమర్షియల్ స్టోరీతో రూపొందింది. దీనికితోడు ఈ సినిమా ప్రచార చిత్రాలకు సైతం మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాపై కాస్త హైప్ ఏర్పడింది. ఫలితంగా గ్రాండ్‌గా ఇది రిలీజ్ అయింది.

కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పురుషోత్తముడు' సినిమా జూలై 26వ తేదీన థియేటర్లలోకి వచ్చేసింది. దీనికి ఆశించిన స్థాయిలో మౌత్ టాక్ రాకపోవడంతో ప్రేక్షకుల నుంచి కూడా స్పందన అనుకున్న విధంగా రాలేదు. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీంతో ఈ చిత్రం ఓటీటీ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్న సంగతి తెలిసిందే.
చాలా ట్విస్టులతో సాగిపోయే కథతో రూపొందిన 'పురుషోత్తముడు' సినిమాపై కాస్త హైప్ ఉండడంతో ఈ మూవీ ఓటీటీ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సంస్థ సొంతం చేసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు ఫిలిం నగర్‌లో ప్రచారం జరుగుతోంది.

రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'పురుషోత్తముడు' సినిమా పరాజయం పాలవడంతో వీలైనంత త్వరగానే ఇది ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ, ఇది నెల రోజులైన ఓటీటీలోకి రాలేదు. అయితే, ఈ చిత్రాన్ని ఆగస్టు 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకు రాబోతున్నట్లు ఆహా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆహా సంస్థ తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'పురుషోత్తముడు' సినిమాను శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డాక్టర్ రమేష్ తేజావత్, ప్రకాశ్ తేజావత్‌లు నిర్మించారు. ఇందులో హాసినీ సుధీర్ హీరోయిన్‌గా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, మురళీ శర్మ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











